Indian Embassy in Tehran | వెంటనే ఇరాన్‌ను వీడండి.. పౌరులకు భారత్ కీలక అడ్వైజరీ
Indian Embassy in Tehran | పశ్చిమాసియా (Middle East)లో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్‌కు ఎలాంటి ప్రయాణాలూ చేయొద్దని (Travel Advises) సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది.
Indian Embassy in Tehran | పశ్చిమాసియా (Middle East)లో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ (Iran)తో ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని.. దాడులు చేయొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) ఎంత చెప్పినా ఇజ్రాయెల్ వినడం లేదు. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ భీకర దాడులు కొనసాగిస్తోంది. సోమవారం ఉదయం టెహ్రాన్‌తోపాటూ పలు ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్‌లో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో భారత్ (Indian Embassy in Tehran) అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయ పౌరులకు (Indian Citizens) కీలక అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌కు ఎలాంటి ప్రయాణాలూ చేయొద్దని (Travel Advises) సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా టెహ్రాన్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది.
Embassy of India in Iran- "In view of the latest developments in the region, the Embassy reiterates its earlier advice to all Indian Nationals to avoid any travel to Iran. Indian Nationals presently in Iran are also advised to exit the country by available means of transport." pic.twitter.com/Llu281nyXg
— ANI (@ANI) June 8, 2026
టెహ్రాన్ సహా పలు నగరాల్లో పేలుళ్లు..
తాజా నివేదికల ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు పలు ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఏప్రిల్ లో కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష దాడి ఇదే కావడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఐడీఎఫ్ దాడులతో టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రిజ్, కరజ్, కెర్మన్ షా వంటి కీలక నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్‌కు (Iran) చెందిన మిస్సైల్ లాంచ్ సైట్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అంతేకాకుండా మహ్ షహర్ (Mahshahr) లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌ను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో, టెహ్రాన్ ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఉన్న గగనతలాన్ని (Airspace) ఇరాన్ మూసివేసింది.
నెతన్యాహుకు వేరే దారి లేదు..
మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు (Benjamin Netanyahu) వేరే దారి లేదని.. ఇరాన్‌తో ఒప్పందానికి అంగీకరించక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) స్పష్టం చేశారు. శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని వెల్లడించారు. "ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపే దాడులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేది నేనే. నెతన్యాహు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేరు. మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌తో వాషింగ్టన్ కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నైనా అంగీకరించడం మినహా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రికి మరో ప్రత్యామ్నాయం లేదు" అని ది ఫైనాన్సియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని వెల్లడించారు. ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార దాడులూ చేయొద్దంటూ ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ సూచించారు. అయితే, ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌పై ఐడీఎఫ్ దళాలు విరుచుపడ్డాయి.
Also Read..
నెతన్యాహుకు వేరే దారి లేదు.. ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే : డొనాల్డ్ ట్రంప్
గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన తమిళననాడు సీఎం విజయ్
రేపు కౌలు రైతుల సర్వే రిపోర్ట్ వెల్లడిస్తాం: కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
సంబంధిత వార్తలు

BJP Ramchandar Rao- ATA | అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర ఎనలేనిది.. ఇక్కడికొచ్చి కూడా సంసృతిని కాపాడడం అభినందనీయం
ఆగస్టు 2, 2026

Peddi Sudarshan Reddy | ‘పెద్ది’ ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్
ఆగస్టు 1, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు ధరల షాక్.. సూచీలు భారీగా పతనం..
జులై 24, 2026
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం



