RIMS Incident | గర్భిణీ మృతి ఘటన.. రిమ్స్ వైద్యురాలికి ఉద్వాసన
RIMS Incident | ఓ గర్భిణీ మృతి చెందిన ఘటనలో ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆస్పత్రి వైద్యురాలిపై అధికారులు వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఉద్యోగాన్ని ఊడగొట్టారు (Removal).
- కాంట్రాక్ట్ సేవలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
RIMS Incident | త్రినేత్ర న్యూస్: ఓ గర్భిణీ మృతి చెందిన ఘటనలో ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆస్పత్రి వైద్యురాలిపై అధికారులు వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఉద్యోగాన్ని ఊడగొట్టారు (Removal). ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బోరకాని సునీత (25) గర్భిణీ మరణ ఘటనపై విచారణ అనంతరం డాక్టర్ సాహిత్య గుమ్ముల కాంట్రాక్ట్ సేవలను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు (Orders) వెలువరించారు.
ఇదీ జరిగింది..
సునీత 32 వారాల జంట గర్భంతో, రక్తహీనత, గతంలో సిజేరియన్ ప్రసవం వంటి వైద్య సమస్యలతో గత అక్టోబర్ 21న రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చేరారు. కాళ్ల వాపుతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు, పర్యవేక్షణ నిర్వహిస్తూ చికిత్స అందించారు. అదే నెల 24 తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరిస్థితి విషమించింది. దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఉదయం 6.30 గంటలకు ఆమె మృతి చెందారు.
ఈ ఘటనపై కమిషనర్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు నలుగురు సభ్యుల విచారణ కమిటీ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించింది. వైద్య రికార్డులు, కేస్ షీట్లు, చికిత్స వివరాలు, సంబంధిత వైద్య సిబ్బంది వాంగ్మూలాలను పరిశీలించింది. విచారణలో రక్తపోటు సాధారణ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ లాబెటలోల్ మందు మోతాదును పెంచడం, సీనియర్ వైద్యుల పర్యవేక్షణ, రోగి పరిస్థితిని పునఃపరిశీలించడం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తిన అనంతరం సకాలంలో వైద్య జోక్యం, చికిత్సను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో లోపాలపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
లోపాలపై ఆగ్రహం
రోగి పరిస్థితి విషమించిన సమయంలో సకాలంలో పునఃపరిశీలన, తగిన వైద్య చర్యలు తీసుకోవడంలో జరిగిన జాప్యాన్ని విచారణ నివేదిక ప్రస్తావించింది. ఘటన జరిగిన సమయంలో డ్యూటీ వైద్యురాలిగా ఉన్న డాక్టర్ సాహిత్య గుమ్ముల సకాలంలో స్పందించకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి లోపాలను కమిటీ తీవ్రంగా పరిగణించింది. విచారణ నివేదిక ఆధారంగా ఆమె కాంట్రాక్ట్ సేవలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలే
గర్భిణీలు, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులకు నిరంతర వైద్య పర్యవేక్షణ, సకాలంలో పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించడం అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేశారు. వైద్య సేవల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






