Saurav Das | హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్
Saurav Das | తనను ఓ పనికిరానివాడంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన విమర్శలపై కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) తాజాగా కౌంటర్ ఇచ్చారు. తనపై ఎంపీ వ్యక్తిగత విమర్శలకు దిగడానికి కారణం తాను యువ హృతిక్ రోషన్ (Hrithik Roshan)లా కనిపించడమే కావొచ్చని తన స్నేహితులు అంటున్నారంటూ దాస్ చమత్కరించారు.
Saurav Das | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut), కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తనను ఓ పనికిరానివాడంటూ కంగన చేసిన విమర్శలపై సౌరవ్ దాస్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. తనపై ఎంపీ వ్యక్తిగత విమర్శలకు దిగడానికి కారణం తాను యువ హృతిక్ రోషన్ (Hrithik Roshan)లా కనిపించడమే కావొచ్చని తన స్నేహితులు అంటున్నారంటూ దాస్ చమత్కరించారు.
ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై స్పందించారు. రాజకీయ నాయకురాలు, నటి అయిన కంగన తనను టార్గెట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే తన గురించి ఇంతకంటే మంచి సమాచారమే వస్తుందని అన్నారు. "ఆమె ఇప్పుడు నీ మీద పడిందేంటి..? అని నా ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు. అందులో ఒకరు ఆమెను నువ్వు చిన్నప్పటి హృతిక్ రోషన్‌లాగా కనిపిస్తున్నావేమో అని అన్నారు. అది నిజమేనా..? నా ఫ్రెండ్స్ అలా అనడంతో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది" అంటూ ఎగతాళిగా మాట్లాడారు.
అభిప్రాయభేదాలను వ్యక్తిగత విమర్శల కంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. అదే సమయంలో కంగనపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. ఆమే తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా చెప్పానన్నారు. "కంగన కాస్త కూల్ అవ్వు. దీని గురించి మాట్లాడుకుందాం" అని క్యాప్షన్ పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారని.. చర్చలు, సంప్రదింపులు తగ్గిపోయాయని అన్నారు. ఇదే దేశంలో ఉన్న పెద్ద సమస్య అని దాస్ వ్యాఖ్యానించారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ చర్చించుకునే వాతావరణం ఉండాలని దాస్ అభిప్రాయపడ్డారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అప్పుడెందుకు స్పందించలేదు..?
విద్యార్థి నిరసనకారులపై కంగన చేసిన వివాదాస్పద జెన్ గట్టర్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినీ, రాజకీయ వర్గాలు కంగనపై మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. ఆమెను అసలు ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు..? అంటూ ప్రశ్నించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలతో నష్టపోయిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చినప్పుడు ఆమె ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
వాళ్లే లేకపోతే మీకు ఈ స్టార్‌డమ్ ఎక్కడిది..?
నీట్ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే వాంతి వచ్చేలా ఉన్నాయంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై రియల్ హీరో సోనూసూద్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కంగన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవేళ ఆమె నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అది అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. యువతే లేకపోతే మీకు ఈ స్టార్‌డమ్ ఎక్కడిది..? అంటూ ప్రశ్నించారు. నటులకు గుర్తింపు వచ్చేది యువత వల్లేనన్నారు. వాళ్లే లేకపోతే సినీ తారలైనా, రాజకీయ నేతలకైనా గుర్తింపు ఎలా వస్తుందన్నారు. మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలంటూ చురకలంటించారు. వృత్తి ఏదైనా అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు.
Also Read..
యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
హిమాన్షు రావుకు సర్జరీ.. గచ్చిబౌలి ఏఐజీకి కేసీఆర్
వాట్సాప్ వెబ్‌లో కాలింగ్ ఫీచర్.. ఇక బ్రౌజర్ నుంచే ఆడియో, వీడియో కాల్స్..
సంబంధిత వార్తలు

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
సెప్టెంబర్ 20, 2026

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026

Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్



