Gold And Silver Prices Today | యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో స్టాక్ మార్కెట్లు గురువారం ఒడిదుడుకుల మధ్య ప్రారంభం అయ్యాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో స్టాక్ మార్కెట్లు గురువారం ఒడిదుడుకుల మధ్య ప్రారంభం అయ్యాయి. సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నప్పటికీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బులియన్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు తగ్గింది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.78 శాతం మేర తగ్గి 4,034 డాలర్లకు చేరగా, వెండి ధర 0.83 శాతం మేర తగ్గి 57 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 201 పాయింట్ల మేర స్వల్పంగా తగ్గి 1,41,580 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1629 పాయింట్లు నష్టపోయి 2,15,850 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,433 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 464గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,330 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,43,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,230 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,23,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,825 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,82,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
సెప్టెంబర్ 21, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం



