Kangana Ranaut | నువ్వో పనికిరానివాడివి.. కాక్రోచ్ పార్టీ ప్రతినిధిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు
Kangana Ranaut | కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das)పై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని పనికిరాని, నిరుద్యోగి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut), కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) మధ్య వివాదం మరింత ముదరుతోంది. నీట్ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే వాంతి వచ్చేలా ఉన్నాయంటూ కంగన చేసిన వ్యాఖ్యలకు సౌరవ్ దాస్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆమె మాటలను పట్టించుకోవాల్సిన వసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దాస్‌పై కంగన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన్ని పనికిరాని, నిరుద్యోగి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
కంగన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో సౌరవ్ దాస్ ఫొటోను పంచుకుంటూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "గూగుల్‌లో వెతికితే ఆయన వయసు 28 ఏళ్లని తెలిసింది. ఈ వయసులో కూడా తనను తాను విద్యార్థిగా ఎలా చెప్పుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను గత రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. గత 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. ఆయన వయసులోనే నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే నిర్మాతగా, కళాకారిణిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా, పారిశ్రామికవేత్తగా బిజీగా మారిపోయాను. నీలాంటి పూర్తిగా పనికిరాని, నిరుద్యోగి అయిన వ్యక్తికి విజయవంతమైన జీవితం అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. సౌరవ్.. నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. పూర్తిగా పనికిరానివాడివి. ముందుగా స్కిల్స్ నేర్చుకోవడం ప్రారంభించు. అదే నీకు మంచి ఆరంభం అవుతుంది" అని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు జెన్ జెడ్‌ను ఉద్దేశించి కంగన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జెన్ జెడ్ నిరసనకారుల్ని జనరేషన్ గట్టర్‌గా అభివర్ణించారు. నిరసనకారులు ఓ మురికి కాలువ లాంటివారన్నారు. నీట్ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే వాంతి వచ్చేలా ఉన్నాయన్నారు. తన జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె కామెంట్స్‌పై సౌరవ్ దాస్ స్పందించారు. "ఆమెను సొంత పార్టీ నేతలే పట్టించుకోరు. సీరియస్‌గా తీసుకోరు. అలాంటప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి..? ఆమె ఓ రాజకీయ నాయకురాలు. ఆమె అభిప్రాయాలపై యువత పెద్దగా ఆసక్తి చూపరు" అని దాస్ పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గానే దాస్‌పై కంగన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read..
నడ్డా Vs ఖర్గే.. సీజేపీ ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై భగ్గుమన్న రాజ్యసభ
ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
బ్లాక్‌సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
సంబంధిత వార్తలు

Etala Rajendar | దేశం విచ్ఛిన్నం కావాలని.. ఎన్నో దేశాలు సీజేపీకి నిధులిస్తున్నయ్
ఆగస్టు 30, 2026

Instagram Engagement | జెన్‌జీ నిరసనల తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్మెంట్.. 289.9% వృద్ధి
ఆగస్టు 26, 2026

Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్



