Vehicle Insurance | వాహనదారులకు షాక్.. ఇన్సూరెన్స్ లేకపోతే నో ఫ్యుయల్.. పెరగనున్న ప్రీమియం ధరలు..
Vehicle Insurance | దేశంలో కార్లు, బైక్‌ల ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం విధించడం, కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల దీర్ఘకాలిక బీమా పాలసీలు తీసుకురావడం, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనం విక్రయించకుండా చర్యలు చేపట్టడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి.
Vehicle Insurance | దేశంలో కార్లు, బైక్‌ల ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం విధించడం, కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల దీర్ఘకాలిక బీమా పాలసీలు తీసుకురావడం, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనం విక్రయించకుండా చర్యలు చేపట్టడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం..
దేశవ్యాప్తంగా వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండేలా కేంద్ర రోడ్డు రవాణా శాఖ పలు కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారుల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. దీంతో తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల కాలపరిమితితో ఒకేసారి ప్రీమియం చెల్లించి దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ పొందే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాహనాల ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి ప్రాథమిక ప్రీమియం ధరల మార్పులపైనా సమీక్ష జరుగుతోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి.
ఇన్సూరెన్స్ లేకపోతే నో ఫ్యూయల్..
ఇక ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు రోడ్డు రవాణా, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు కలిసి నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. తొలుత హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు చొప్పున పెట్రోల్ బంకుల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించి, వాటికి చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ ఉందో లేదో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలిస్తారు. దేశంలో ప్రస్తుతం సుమారు 25 కోట్ల వాహనాలకు మాత్రమే చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ ఉంది. ఇది మొత్తం వాహనాల్లో దాదాపు 81 శాతం. భారీ వాణిజ్య వాహనాల్లో 90 శాతానికి పైగా, కార్లలో 88 శాతం, ద్విచక్ర వాహనాల్లో 80 శాతం బీమా పరిధిలో ఉన్నాయి. మూడు చక్రాల వాహనాల్లో మాత్రం ఈ సంఖ్య కేవలం 57 శాతంగా ఉంది.
ఎప్పటి నుంచి అమలు చేస్తారు..?
మోటారు వాహనాల చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. రోడ్డు ప్రమాదాల్లో ఇతరులకు గాయాలు, మరణాలు లేదా ఆస్తి నష్టం జరిగినప్పుడు బాధితులకు పరిహారం అందించేందుకు ఈ బీమా ఉపయోగపడుతుంది. బీమా లేని వాహనాలతో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, వారి కుటుంబాలు పరిహారం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా అమలు చేసే తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ మార్పులు అమల్లోకి వస్తే వాహనదారుల బీమా ఖర్చులు పెరగడంతోపాటు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం మరింత కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది.
సంబంధిత వార్తలు

Vehicle Insurance | వాహనదారులకు కీలక అలర్ట్.. బీమా లేకుండా టోల్‌ప్లాజా దాటితే ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు
నవంబర్ 17, 2026

Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?
ఆగస్టు 6, 2026

Car Insurance | వరదలో కారు మునిగిందా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను తిరస్కరిస్తారు, జాగ్రత్త..
జులై 4, 2026
తాజావార్తలు
- ●Graduate MLC | గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు..
- ●Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!
- ●Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం
- ●Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత
- ●Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల్లో ర్యాలీ..
- ●Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!

Graduate MLC | గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు..

Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!

Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం

Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత



