Kangana Ranaut | గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్ట్.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్
Kangana Ranaut | గాంధీ కుటుంబాన్ని (Gandhi Family) ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద పోస్టుల వ్యవహారంలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Kangana Ranaut | త్రినేత్ర న్యూస్: గాంధీ కుటుంబాన్ని (Gandhi Family) ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద పోస్టుల వ్యవహారంలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi), ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ మరణాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ షిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) రాకతోనే గాంధీ కుటుంబంలో వరుస విషాదాలు సంభవించాయని, వారసులంతా అనుమానాస్పద రీతిలో మరణించారని కంగనా ఆరోపించారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావని, వీటి వెనుక తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీని ‘అంతుచిక్కని విదేశీ వ్యక్తి’ (మిస్టీరియస్ ఫారినర్)గా అభివర్ణిస్తూ ఈ నెల 10న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) విడుదలైన రోజే ఈ పోస్టులు రావడం గమనార్హం.
ఎమర్జెన్సీ సినిమా కోసం..
తాను తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం గాంధీ కుటుంబంపై లోతైన పరిశోధన జరిపానని, ఆ సయంలో ఎన్నో వింత విషయాలు తెలిశాయన్నారు. గాంధీ కుటుంబంలోకి ఓ విదేశీ మహిళ ప్రవేశించిన తర్వాతే ఇందిరా గాంధీ ( Indira Gandhi), సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వంటి రాజకీయ వారసులంతా ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. చివరికి ఆ విదేశీ వ్యక్తే ఆ కుటుంబ సంపదకు, రాజకీయ వారసత్వానికి ఏకైక అధికారిగా నిలవడం వెనుక ఆశ్చర్యకరమైన యాదృచ్ఛికాలు ఉన్నాయని, ప్రజలు వీటిపై ఎందుకు ఆలోచించడం లేదని ఆమె ప్రశ్నించారు.
ఒంటరైపోయిన మేనకా గాంధీ..
అదేవిధంగా సంజయ్ గాంధీ (Sanjay Gandhi) అకాల మరణం తర్వాత ఆయన భార్య మేనకా గాంధీ పట్ల సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై కూడా కంగన విమర్శలు గుప్పించారు. సంజయ్ గాంధీ ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న మేనక.. ఆయన మరణంతో ఒంటరైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వితంతువుగా మారిన మేనకా గాంధీని, ఆమె పసిబిడ్డను ఏమాత్రం కనికరం లేకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపించారు.
పాత వీడియోపై కూడా..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన గాంధీ కుటుంబానికి సంబంధించిన ఓ పాత వీడియోపై స్పందిస్తూ.. కుటుంబ సభ్యులందరూ సోనియా గాంధీ కనుసన్నల్లోనే మసలుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. కానీ, భర్తను కోల్పోయి ఒంటరిగా మారిన మేనకా గాంధీ (Maneka Gandhi) మాత్రం ఎంతో చిన్నబుచ్చుకుని, దూరంగా నిలబడ్డారన్నారు. విదేశాల్లోని ఓ చిన్న కేఫ్‌లో రాజీవ్ గాంధీకి యాదృచ్ఛికంగా పరిచయమై, ఆ తర్వాత దేశ అత్యున్నత రాజకీయ కుటుంబంలోకి అడుగుపెట్టిన సోనియా గాంధీ.. దశాబ్దాల పాటు భారత దేశాన్ని శాసించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
కంగనా సోషల్‌మీడియా పోస్టుపై రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ హిమాచల్ ప్రదేశ్ డీజీపీ అశోక్ తివారీకి ఫిర్యాదు చేశారు. కంగనా రనౌత్ తన ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతా నుంచి నవంబర్ 10న కొన్ని పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. వాటిలో ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) మరణాలకు సంబంధించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. సోనియా గాంధీని `రహస్య విదేశీ పౌరురాలు` (Mysterious Foreign National) అని సంబోధించడంతో పాటు, సంజయ్ గాంధీ మరణం తర్వాత మేనకా గాంధీని ఇంటి నుండి బయటకు పంపించారని కంగనా ఆరోపించినట్లుఈ పోస్టుల ద్వారా తప్పుడు అభిప్రాయాలు కలిగించే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!






