త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | రాష్ట్ర‌మిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మ‌నం రాయాలి

Jagga Reddy | రాష్ట్ర‌మిచ్చిన సోనియాగాంధీ (Sonia Gandhi)నే త‌న ఆత్మ‌క‌థ‌ (Autobiography) పుస్త‌కంలో తెలంగాణపై రాయ‌డం కాద‌ని.. తీసుకున్న మ‌నం ఆమెపై రాయాల‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జ‌గ్గారెడ్డి (Jagga Reddy) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Nov 12, 2026, 6.46 pm IST

Jagga Reddy | రాష్ట్ర‌మిచ్చిన సోనియానే రాసుకోవాల్నా.. తీసుకున్న మ‌నం రాయాలి
Advertisement
  • బీఆర్ఎస్ నాయ‌కుల‌కు ఆ ఆలోచ‌న్నే లేదు
  • సోనియాపై తీసే సిన్మాలో నాదీ నిజ‌మైన పాత్రనే
  • డిసెంబ‌ర్ 9కి షూటింగ్ స్టార్ట్ చేస్తా
  • దీనిపై సీఎం రేవంత్‌, నాతో మంచిగుండే మంత్రుల‌తో మాట్లాడ్తా
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు

Jagga Reddy  | త్రినేత్ర న్యూస్: రాష్ట్ర‌మిచ్చిన సోనియాగాంధీ (Sonia Gandhi)నే త‌న ఆత్మ‌క‌థ‌ (Autobiography) పుస్త‌కంలో తెలంగాణపై రాయ‌డం కాద‌ని.. తీసుకున్న మ‌నం ఆమెపై రాయాల‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జ‌గ్గారెడ్డి (Jagga Reddy) వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయ‌కుల‌కు ఆ ఆలోచ‌న కూడా లేద‌న్నారు. సోనియాపై తీసే సిన్మాలో త‌న‌ది కూడా నిజ‌మైన పాత్ర‌నేన‌ని నొక్కి చెప్పారు. డిసెంబ‌ర్ 9కి షూటింగ్ ప్రారంభించి వ‌చ్చే ఏడాది విడుద‌ల చేస్తామ‌న్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, స‌న్నిహితంగా ఉన్న మంత్రులతో సినిమాపై మాట్లాడతాన‌ని చెప్పారు. గురువారం హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు.

మా అమ్మ‌ను చూసి నేర్సుకున్న‌

సోనియా గాంధీ తన జీవిత ప్రయాణం గురించి పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని అధికారిక పాలనా, ప్రతిపక్ష రాజకీయాన్ని నడిపించి ప్రజా సేవ చేసిన చరిత్ర సోనియా గాంధీది. అందుకే సోనియాగాంధీ రాసిన ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భర్త చనిపోతే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మా అమ్మ నుంచి నేర్చుకున్న. ఆ తల్లి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్న.

ఆమె చ‌రిత్ర తెల్వ‌ని చిన్న పిల్ల‌

కంగనా రనౌత్ లీడర్ కాదు.. యాక్టర్. చరిత్ర తెలియని చిన్నపిల్ల. ప్రతి మహిళను తల్లిగా భావించాలని ప్రసంగాలు ఇచ్చే ఆర్ఎస్ఎస్‌.. రాజకీయ కారణాలు చూపి సోనియా గాంధీని విమర్శించడమేనా వాళ్ల‌ సిద్ధాంతం అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నరు. బీజేపీ, ఎంఐఎంలది పాలోళ్ల‌ పంచాయితీ లాంటిది.
ఉదయం తన్నుకుంటారు సాయంత్రం క‌ల్లు దుకాణంల క‌లుస్త‌రు.

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చ‌నిపోవడం వ‌ల్ల జ‌రిగిన బెనిఫిట్ ఇదే

వినోద్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చావు.. ఇంత చీప్ పాలిటిక్స్ చేయకు. సోనియా గాంధీ త‌న పుస్త‌కంలో రాసుకోవాలా? తెలంగాణ తీసుకున్న‌ మ‌నం రాయాలి. దేశానికి పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారంటే సోనియా గాంధీనే కారణం. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చ‌నిపోవ‌డం వ‌ల్ల బెనిఫిట్ జరిగింది ఏంటంటే తెలంగాణ వ‌చ్చింది. తెలంగాణ‌ రాష్ట్రం విడిపోయాక‌ రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యింది సోనియా గాంధీ వల్లనే. ఇదే కదా నిజం.

Advertisement
Advertisement