త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranut | ప‌దిహేడేళ్ల త‌ర్వాత తెలుగు డైరెక్ట‌ర్‌తో కంగ‌నా ర‌నౌత్ మూవీ – హిట్టు కోసం హార‌ర్ బాట‌

ప‌దిహేడేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగు ద‌ర్శ‌కుడితో బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఓ సినిమా చేయ‌బోతుంది. హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు స్కేరీ పిక్చ‌ర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అల్ల‌రి ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను సురేష్‌బాబు నిర్మించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Nov 13, 2026, 2.13 pm IST

Kangana Ranut | ప‌దిహేడేళ్ల త‌ర్వాత తెలుగు డైరెక్ట‌ర్‌తో కంగ‌నా ర‌నౌత్ మూవీ – హిట్టు కోసం హార‌ర్ బాట‌
Advertisement

Kangana Ranut | బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) ప‌దిహేడేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత తెలుగు (Tollywood) ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేయ‌బోతుంది. హిట్టు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ బీజేపీ ఎంపీ హార‌ర్ క‌థ‌తో త‌దుప‌రి సినిమా చేయ‌బోతుంది. కంగ‌నా ర‌నౌత్ కొత్త మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న శుక్ర‌వారం వ‌చ్చేస్తోంది. హార‌ర్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు స్కేరీ పిక్చ‌ర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

అల్ల‌రి ర‌విబాబు

అల్ల‌రి ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు నిర్మించ‌బోతున్నారు. ఈ హార‌ర్ మూవీ (Horror Movie)రిలీజ్ డేట్‌ను కూడా చెప్పేశారు. 2027లో ఎప్పుడైనా విడుద‌ల కావ‌చ్చునంటూ వెరైటీగా ప్ర‌క‌టించారు.

ఏక్ నిరంజ‌న్‌...

ర‌విబాబు గ‌త సినిమాల త‌ర‌హాలోనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ హార‌ర్ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. హిందీ, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న‌ట్లు తెలిసింది. పూరి జ‌గ‌న్నాథ్ ఏక్ నిరంజ‌న్ త‌ర్వాత తెలుగు ద‌ర్శ‌కుడితో కంగ‌నా ర‌నౌత్ చేస్తోన్న సెకండ్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

హిట్టు కోస‌మే...

గ‌త కొన్నేళ్లుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటోన్న కంగ‌నా ర‌నౌత్ ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఇవేవీ ఆమెకు విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌డం లేదు. మంచి హిట్టు కోస‌మే ఈ బాలీవుడ్ హీరోయిన్ హార‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

Advertisement
Advertisement