WhatsApp | వాట్సాప్ వెబ్‌లో కాలింగ్ ఫీచర్.. ఇక బ్రౌజర్ నుంచే ఆడియో, వీడియో కాల్స్..
WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా వాట్సాప్ వెబ్ ద్వారానే వన్-టు-వన్, గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ చేయడంతోపాటు కాల్స్‌ను స్వీకరించే అవకాశం కల్పించింది.
Technology | Published On Jul 30, 2026, 11.10 am IST
WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా వాట్సాప్ వెబ్ ద్వారానే వన్-టు-వన్, గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ చేయడంతోపాటు కాల్స్‌ను స్వీకరించే అవకాశం కల్పించింది. ఈ సదుపాయం సపోర్ట్ చేసే వెబ్ బ్రౌజర్‌లలో అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ వెబ్ కాలింగ్‌లో స్క్రీన్ షేరింగ్, ఎమోజీ రియాక్షన్లు, ప్రత్యేక కాల్స్ ట్యాబ్, పూర్తి కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్ తదితర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్రౌజర్ ద్వారా చేసే కాల్స్‌కు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని, కాల్స్‌కు ఎలాంటి సమయ పరిమితి ఉండదని, అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని వాట్సాప్ వెల్లడించింది.
కాల్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం..
అలాగే కాల్ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా కొనసాగుతున్న గ్రూప్ కాల్‌ను మధ్యలో డిస్‌కనెక్ట్ చేయకుండా ఒక డివైస్ నుంచి మరో సపోర్ట్ చేసే డివైస్‌కు మార్చుకోవచ్చు. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో ప్రారంభించిన కాల్‌ను వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్‌కు మార్చుకోవచ్చు. అలాగే అవసరమైతే మళ్లీ మొబైల్‌లో కూడా అదే కాల్‌ను కొనసాగించవచ్చు. గ్రూప్ కాల్స్ కోసం వెయిటింగ్ రూమ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. కాల్ లింక్ సృష్టించే సమయంలో రిక్వైర్ అప్రూవల్ టు జాయిన్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే, కాల్‌లో చేరే వారు ముందుగా వెయిటింగ్ రూమ్‌లో ఉంటారు. హోస్ట్ అనుమతి ఇచ్చిన తర్వాతే వారు గ్రూప్ కాల్‌లో చేరుతారు.
మరింత మెరుగ్గా వీడియో కాలింగ్..
వీడియో కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు క్విక్‌హెచ్‌డీ (Quick HD) ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల కాల్ ప్రారంభమైన తొలి కొన్ని సెకన్లలోనే హై-డెఫినిషన్ వీడియో నాణ్యత లభిస్తుంది. అలాగే నాయిస్ సప్రెషన్ ఫీచర్ ద్వారా కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి, వాయిస్ మరింత స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. కాల్ కొనసాగుతున్న సమయంలోనే ఇన్-కాల్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌ను అవసరానికి అనుగుణంగా ఆన్ లేదా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త కాలింగ్ ఫీచర్లు దశలవారీగా విడుదల చేస్తున్నామని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందరు వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. అయితే భారత్‌లోని వినియోగదారులకు ఈ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
సంబంధిత వార్తలు

WhatsApp | ఇక బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.. కొత్త అప్డేట్ వచ్చేసింది..
సెప్టెంబర్ 3, 2026

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
ఆగస్టు 27, 2026

Direct To Cell Service | మొబైల్ టవర్ లేకున్నా వాట్సాప్.. స్టార్‌లింక్‌తో ఎయిర్టెల్ కొత్త సేవలు
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం



