Cockroach Janata Party | సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న ‘కాక్రోచ్ పార్టీ’.. ఇందులో చేరాలంటే ఈ అర్హతలు మస్ట్ మరి..
Cockroach Janata Party | మన దేశంలో రాజకీయ పార్టీలకు కొదవ లేదు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన ఈ పార్టీ కేవలం నాలుగు రోజుల్లోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Cockroach Janata Party | ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సీజేఐ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నుంచి ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. అదే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party).
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఈ పార్టీని స్థాపించారు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కాన్వా (Canva) డిజైన్ల సహాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. కేవలం 76 గంటల్లోనే ఏకంగా 45 లక్షలకుపైగా ఫాలోవర్లను సంపాదించి హాట్ టాపిక్‌గా మారింది. కాక్రోచ్ పార్టీతో అభిజీత్ డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేక వెబ్‌సైట్, ఐదు సూత్రాల మేనిఫెస్టో కూడా ఉంది.
ఇదే పార్టీ నినాదం..
తమను తాము ‘సోమరులు, నిరుద్యోగుల గొంతుక’గా ప్రకటించుకున్న ఈ పార్టీ.. తమ నినాదాన్ని ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అని చెప్పుకుంటోంది.
పార్టీలో చేరాలంటే ఈ అర్హతలు మస్ట్..
అలాగే ఈ పార్టీలో చేరడానికి వింతైన అర్హతలను కూడా పెట్టింది. పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలని, సోమరితం ఉండాలని, సోషల్ మీడియాకి అతుక్కొని ఉండాలని, ప్రజా సమస్యలపై గళం విప్పే అలవాటు ఉండాలని స్పష్టం చేసింది.

‘కాక్రోచ్’ మేనిఫెస్టో..
- న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు.
- ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలి.
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం కాకుండా.. 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాదు, మంత్రివర్గంలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్సులను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.

Also Read..
రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్‌లో ఉంది : బీజేపీ
మెలోడీ ఎఫెక్ట్.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు భారీగా ర్యాలీ..
గూగుల్ బంపర్ ఆఫర్.. ఏఐ ప్లాన్ తీసుకుంటే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | దేశ విద్యా వ్యవస్థపై ధర్మేంద్ర ప్రధాన్ అనే వైరస్ దాడి చేస్తోంది : కాక్రోచ్ పార్టీ
జూన్ 20, 2026

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
జూన్ 19, 2026

NEET-UG 2026 | నీట్ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్.. ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి



