BJP | రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్‌లో ఉంది : బీజేపీ
BJP | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలను బీజేపీ (BJP) తీవ్రంగా ఖండించింది. రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్, ఇతర దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వ్యాఖ్యానించారు.
BJP | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలను బీజేపీ (BJP) తీవ్రంగా ఖండించింది. రాహుల్ పదేపదే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. తన వ్యాఖ్యలతో దేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించింది.
"ప్రధాని మోదీని రాహుల్ పదేపదే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆయన్ని దేశద్రోహి (traitor) అనడం సరికాదు. తన వ్యాఖ్యలతో రాహుల్ 140 కోట్ల మంది ప్రజలను అవమానించారు. రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్, ఇతర దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఉంది" అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత షెహజాబ్ పూనావాలా సైతం రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని రాహుల్ ఎప్పుడూ అగౌరవపరుస్తూనే ఉన్నారని, ఆయన తల్లిని కూడా అవమానించారని గుర్తు చేశారు.
కాగా, బుధవారం రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. "ఆర్ఎస్ఎస్ (RSS) కార్యకర్తలు మీ ముందుకు వచ్చి ప్రధాని మోదీ, అమిత్ షా (Amit Shah) గురించి మాట్లాడినప్పుడు.. మీ ప్రధాని ఓ దేశ ద్రోహి, మీ హోం మంత్రి ఓ దేశ ద్రోహి, మీ సంస్థ (ఆర్ఎస్ఎస్‌ను ఉద్దేశించి) దేశద్రోహమైనది అని మీరు వారి ముఖం మీదే చెప్పండి. ఈ ముగ్గురూ భారతదేశాన్ని అమ్మేసేందుకు పనిచేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యేందుకు వారు ముగ్గురే కారణం" అని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
Also Read..
రాబోయే రోజుల్లో రైతులకు కనీసం ఎరువులు కూడా దొరకవు : రాహుల్ గాంధీ
మెలోడీ ఎఫెక్ట్.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు భారీగా ర్యాలీ..
రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
జులై 6, 2026

N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు
జులై 6, 2026

PM Modi Tour’s | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని
జులై 6, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



