Cockroach Janta Party | దేశ విద్యా వ్యవస్థపై ధర్మేంద్ర ప్రధాన్ అనే వైరస్ దాడి చేస్తోంది : కాక్రోచ్ పార్టీ
Cockroach Janta Party | పేపర్ లీకేజీలు, నీట్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి నిరసన చేపట్టింది. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద పార్టీ మద్దతుదారులు శనివారం ఆందోళనకు దిగారు.
Cockroach Janta Party | పేపర్ లీకేజీలు, నీట్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి నిరసన చేపట్టింది. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద పార్టీ మద్దతుదారులు శనివారం ఆందోళనకు దిగారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) పిలుపు మేరకు నిరసనకారులు ప్లేట్లు, స్పూన్లతో అక్కడికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గో ప్రధాన్.. గో అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సామాజిక కార్యకర్త, ఉద్యమ కారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కరోనా వైరస్‌తో పోల్చారు. "వైబ్రేషన్స్ సృష్టించబడతాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల కరోనా అనే వైరస్ అంతమవుతుంది. కాబట్టి... కొంతమంది మిత్రులు మరో కొత్త ఆవిష్కరణ చేశారు. వారు ఏమన్నారంటే..? ఈరోజు విద్యావ్యవస్థపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ అనే వైరస్ కూర్చుని ఉంది. చూడండి నేను ఇది సెటైర్‌గా (వ్యంగ్యంగా) చెబుతున్నాను, అభిజీత్‌కు సైన్స్ నాలెడ్జ్ లేదని తర్వాత ఫ్యాక్ట్-చెక్ చేయకండి. ఇది కేవలం సెటైర్. చాలా మంది శాస్త్రవేత్తలు... యునెస్కో (UNESCO) నివేదిక వచ్చింది. ప్లేట్లు మోగించడం ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ అనే వైరస్‌ను కూడా అంతం చేయొచ్చని వారు చెప్పారు. ఆయనను కూడా కుర్చీ (పదవి) నుంచి దించేయొచ్చు. మరి ఈ విద్యావ్యవస్థలో కూర్చున్న ఈ వైరస్‌ను తరిమికొట్టాలా వద్దా..? కాబట్టి పదండి, ప్లేట్లు మోగిస్తూ గో ప్రధాన్ గో అని చెబుదాం..!" అని అభిజీత్ వ్యాఖ్యానించారు.
కరోనా సమయంలో మరో ఆవిష్కరణ కూడా జరిగిందని ఈ సందర్భంగా అభిజీత్ గుర్తు చేశారు. చప్పట్లు కొట్టడం వల్ల కూడా వైరస్ మాయమవుతుందని.. జనం చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారని గుర్తు చేశారు. మరోవైపు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా అందరి పిల్లలతో సమానంగా ఒకే పాఠశాలకు వెళ్లినప్పుడే ఈ వ్యవస్థ మారుతుందని ఉద్యమ కారుడు సోనమ్ వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు.
కాగా, కోవిడ్-19 మొదటి దశ లాక్‌డౌన్‌లో భాగంగా 2020 మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ' పాటించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవలు అందిస్తున్న వారి సేవలను కొనియాడుతూ ప్రజలు తమ ఇళ్ల బాల్కనీలు, మేడలపైకి వచ్చి ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు కొడుతూ శబ్దాలు చేశారు. ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు ప్లేట్లు, స్పూన్లతో సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది.
మరోవైపు కాక్రోచ్ పార్టీ నిరసన నేపథ్యంలో రాజధాని అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. కాగా, దేశ విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) జూన్ 6న కూడా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Go Pradhan Go! pic.twitter.com/FyF7DWEvMz
— Cockroach is Back (@Cockroachisback) June 20, 2026
Also Read..
రాముడిని అవమానించారని కదం తొక్కిన హిందూ సమాజం.. జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా
తండ్రి సినిమాలో శృతి హాసన్ - రియల్ లైఫ్ క్యారెక్టర్‌లోనే....
ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన చిరుత.. వీధి కుక్కను దారుణంగా వేటాడి.. VIDEO
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
జూన్ 19, 2026

Abhijeet Dipke Slapped | జైపూర్‌లో హైడ్రామా: కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే చెంప చెల్లు.. వీడియో వైరల్!
జూన్ 15, 2026

Pawan Kalyan | కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టాం: పవన్ కళ్యాణ్
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు
- ●RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ●Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్



