Google | గూగుల్ బంపర్ ఆఫర్.. ఏఐ ప్లాన్ తీసుకుంటే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..
Google | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినికి చెందిన ప్రొ, అల్ట్రా సబ్‌స్క్రిప్షన్లకు గాను ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా గూగుల్ నిర్వహించిన డెవలపర్ ప్రోగ్రామ్‌లో ఆ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
Technology | Published On May 20, 2026, 3.29 pm IST
Google | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినికి చెందిన ప్రొ, అల్ట్రా సబ్‌స్క్రిప్షన్లకు గాను ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా గూగుల్ నిర్వహించిన డెవలపర్ ప్రోగ్రామ్‌లో ఆ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. గూగుల్ జెమిని ఏఐ ప్రొ, ఏఐ అల్ట్రా సబ్‌స్క్రిప్షన్లు ఉన్న వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియం ఇన్‌బిల్ట్‌గా లభిస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఏఐ ప్రొ, ఏఐ అల్ట్రా ప్లాన్లకు గాను మరిన్ని కొత్త బెనిఫిట్స్‌ను అందిస్తున్నట్లు తెలియజేసింది.
ఎవరెవరికి ఉచితం..
గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు ఇప్పుడు వ్యక్తిగతంగా యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం లభిస్తోంది. ఇక ఏఐ ప్రో యూజర్లకు ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో అదనపు ఛార్జీలు లేకుండా యూట్యూబ్ ప్రీమియం లైట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఎక్కువ వీడియోల్లో యాడ్స్ లేకుండా వీక్షించే అవకాశం ఉంటుంది. యాడ్-ఫ్రీ వీడియోలతో పాటు, ఇటీవల గూగుల్ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ ఫీచర్‌ను కూడా జోడించింది. దీని ద్వారా యూజర్లు వీడియోలను నేరుగా తమ డివైస్‌లో సేవ్ చేసుకుని ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా చూడవచ్చు. అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ ప్లే ఫీచర్ కూడా యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్‌లో చేరింది. దీని సహాయంతో ఇతర యాప్స్ వాడుతున్నప్పటికీ లేదా ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్నప్పటికీ వీడియో ఆడియోను వినవచ్చు.
ప్లాన్ల ధరలు తగ్గింపు..
గూగుల్ తన సబ్‌స్క్రిప్షన్ టియర్లను డెవలపర్లు, టెక్నికల్ లీడ్స్, కంటెంట్ క్రియేటర్ల కోసం మరింత స్పష్టంగా రీడిజైన్ చేసింది. నెలకు 100 డాలర్ల ధరతో కొత్త మిడ్-రేంజ్ టెక్నికల్ టియర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్లాన్ ధర దేశాన్ని బట్టి మారుతుంది. భారత్‌లో యూజర్లు దీన్ని నెలకు రూ.6500కు పొందవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో గూగుల్ ఏఐ ప్రోతో పోలిస్తే జెమిని యాప్, గూగుల్ యాంటీగ్రావిటీ ప్లాట్‌ఫామ్‌లలో 5 రెట్లు ఎక్కువ యూసేజ్ లిమిట్ లభిస్తుంది. అలాగే జెమినీ 3.5 ఫ్లాష్ ద్వారా డీబగ్గింగ్ సపోర్ట్, యాంటీగ్రావిటీ ఏజెంట్-ఫస్ట్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌కు ప్రాధాన్య యాక్సెస్, 20టీబీ క్లౌడ్ స్టోరేజ్, వ్యక్తిగత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి.
యూసేజ్ లిమిట్స్ మార్సు..
టాప్-టియర్ సబ్‌స్క్రిప్షన్ ధరను గూగుల్ 250 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించింది. భారత్‌లో ఈ ప్లాన్‌ను రూ.19,500కి ఇస్తున్నారు. ఈ ప్లాన్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని ఫీచర్లు కొనసాగుతాయి. ప్రొ ప్లాన్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ యూసేజ్ లిమిట్ అందుతుంది. గూగుల్ ఇప్పటి వరకు అమల్లో ఉన్న డైలీ ప్రాంప్ట్ లిమిట్స్‌ను తొలగించి కంప్యూట్-యూజ్డ్ అలొకేషన్ మోడల్‌ను తీసుకొస్తోంది. ఇందులో టాస్క్ కంప్యూటేషనల్ క్లిష్టత ఆధారంగా యూసేజ్ ను లెక్కిస్తారు. సాధారణ టెక్స్ట్ క్వెరీ తక్కువ కోటాను వినియోగిస్తే, వీడియో జనరేషన్ లేదా క్లిష్టమైన కోడింగ్ టాస్కులు ఎక్కువ కోటాను ఉపయోగిస్తాయి. యూజర్లకు ప్రతి ఐదు గంటలకు ఒకసారి లిమిట్స్ రిఫ్రెష్ అవుతాయి. వీక్లీ క్యాప్ పూర్తయితే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా తక్కువ వేగవంతమైన మోడళ్లకు మారుతుంది. దీంతో సేవలు ఆగిపోకుండా కొనసాగుతాయి. అలాగే ఏఐ ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లు గూగుల్ యాంటీగ్రావిటీ, గూగుల్ ఫ్లో, జెమినీ యాప్‌ల కోసం పే-యాజ్-యూ-గో టాప్-అప్ ఏఐ క్రెడిట్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్లను వచ్చే రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా అందించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Preity Zinta | డీప్‌ఫేక్ కంటెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా.. వెబ్సైట్లకు మార్గదర్శకాలపై కోర్టు ఆదేశాలు
జులై 3, 2026

Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడల్.. 4 సెకన్లలో ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది..
జులై 1, 2026

YouTube | యూట్యూబ్‌లోనే చాట్.. 40 దేశాలకు కొత్త ఫీచర్..
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



