Parle Industries | మెలోడీ ఎఫెక్ట్.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు భారీగా ర్యాలీ..
Parle Industries | ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టుతో భారత స్టాక్ మార్కెట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మెలోడీ టాఫీలు గిఫ్ట్‌గా ఇచ్చారని జార్జియా మెలోనీ వెల్లడించడంతో, బుధవారం ట్రేడింగ్‌లో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
Parle Industries | ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టుతో భారత స్టాక్ మార్కెట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మెలోడీ టాఫీలు గిఫ్ట్‌గా ఇచ్చారని జార్జియా మెలోనీ వెల్లడించడంతో, బుధవారం ట్రేడింగ్‌లో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అయితే బీఎస్ఈలో లిస్టెడ్ అయిన పార్లె ఇండస్ట్రీస్ కి మెలోడీ టాఫీలు తయారు చేసే పార్లె ప్రొడక్ట్స్‌తో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదు. మెలోడీ టాఫీని తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్ ముంబై కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ. ఈ కంపెనీ పార్లే-జీ, మొనాకో, హైడ్ అండ్ సీక్, మ్యాంగో బైట్ వంటి పాపులర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. అయితే పార్లే ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ కాదు. ఇక పార్లే ఇండస్ట్రీస్ విషయానికి వస్తే, ఇది ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ వ్యాపారంలో ఉంది. అలాగే పేపర్, పేపర్ వ్యర్థాలు, రీసైక్లింగ్ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.
ఈ ఏడాదిలో భారీగా పతనమైన షేర్ ధర..
గతంలో 1999-2000 వరకు పార్లే ఇండస్ట్రీస్ సంస్థ పార్లే-బిస్లెరీ గ్రూప్‌కు చెందిన పార్లే-బిస్లెరీ లిమిటెడ్‌కు పూర్తిగా అనుబంధ సంస్థగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ కంపెనీకి బిస్లెరీ లేదా పార్లే గ్రూప్‌తో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం పార్లే ఇండస్ట్రీస్ పూర్తిగా పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా కొనసాగుతోంది. మార్చి 2026 నాటికి బ్రిలియంట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 8.53 శాతం వాటాతో అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా ఉంది. బుధవారం ట్రేడింగ్‌లో షేర్ 5 శాతం పెరిగినా, మొత్తం మీద ఈ స్టాక్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ షేర్ 40 శాతానికి పైగా పడిపోయింది. గత 12 నెలల్లో అయితే పార్లే ఇండస్ట్రీస్ షేర్ విలువ 68 శాతం క్షీణించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
జులై 6, 2026

SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
జులై 6, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే.. పెట్టుబడిదారుల్లో ఊపందుకున్న సెంటిమెంట్..
జులై 2, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



