త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cockroach Janta Party | బాధిత కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప్ర‌ధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ‌

Cockroach Janta Party | నీట్‌ ప‌రీక్ష‌ వివాదాల వ‌ల్ల ఆందోళ‌న‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు రూ.కోటి న‌ష్ట‌ప‌రిహారంగా ఇవ్వాల‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ మేర‌కు ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke).. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి బ‌హిరంగ లేఖ రాశారు.

D

National | Published On Jun 19, 2026, 4.19 pm IST

Cockroach Janta Party | బాధిత కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప్ర‌ధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ‌
Advertisement

Cockroach Janta Party | నీట్ పేప‌ర్ లీక్ (NEET paper leaks) వ్య‌వ‌హారం అనేక కుటుంబాల్లో తీర‌ని విషాదాన్ని నింపుతోంది. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడితో విద్యార్థులు (NEET students) సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు విద్యార్థులు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుని త‌నువు చాలించారు. విద్యార్థుల మ‌ర‌ణాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ మేర‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలంటూ ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke).. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి బ‌హిరంగ లేఖ రాశారు.

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల వివాదాల వ‌ల్ల ఆందోళ‌న‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు రూ.కోటి న‌ష్ట‌ప‌రిహారంగా ఇవ్వాల‌ని అందులో డిమాండ్ చేశారు. దేశ భ‌విష్య‌త్తుకు ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ సంక్షోభంపై త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని లేఖ‌లో ప్ర‌ధానిని కోరారు. విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌న్నారు. గ‌డిచిన కొన్ని వారాల్లోనే ఏకంగా 11 మంది విద్యార్థుల‌ను దేశం కోల్పోయింద‌న్నారు. ఇందులో ఐదు మ‌ర‌ణాలు కేవ‌లం 48 గంట‌ల్లోనే చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. రీ-ఎగ్జామ్‌పై అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డ‌డం వ‌ల్ల విద్యార్థుల్లో ఆందోళ‌న ఎక్కువైంద‌న్నారు.

ఆత్మ‌హ‌త్య చేసుకొని మ‌ర‌ణించిన విద్యార్థుల కుటుంబాల‌ను తాను వ్య‌క్తిగ‌తంగా క‌లిసిన‌ట్లు దిప్కే వివ‌రించారు. ఆ కుటుంబాలు పిల్ల‌ల్ని పోగొట్టుకున్న దుఃఖంతోపాటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాయ‌న్నారు. పిల్ల‌ల భ‌విష్య‌త్తుకోసం ఆయా కుటుంబాలు పెద్ద మొత్తంలో ఎడ్యుకేష‌న్ లోన్లు తీసుకున్నార‌న్నారు. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని దిప్కే త‌న లేఖ‌లో ప్ర‌ధానిని కోరారు. బ‌రువెక్కిన హృద‌యంతో తాను ఈ లేఖ‌ను రాస్తున్నాన‌ని అందులో పేర్కొన్నారు.

Also Read..

పెంచిన భూత‌మే కాటేస్తోంది.. సింధు జ‌లాల ఒప్పందానికి కాలం చెల్లింది.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

‘స‌ర్’ పేరుతో ఓట్లు తీసేస్తున్న‌రు.. 2002కు ఇప్ప‌టికి చాలా తేడా ఉంది

భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచ‌ర్ హెచ్చ‌రిక‌ల‌తో ఐటీ షేర్లు ఢ‌మాల్‌..

Advertisement
Advertisement