OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన కొత్త మలుపు మూవీ సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. సోమవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త మలుపు సినిమాలో భైరవి అర్ధ్యా హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Jul 6, 2026, 8.15 pm IST
OTT | టాలీవుడ్ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన కొత్త మలుపు మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. సోమవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా నేరుగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
న్యూ ఏజ్ లవ్‌స్టోరీ...
కొత్త మలుపు మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్‌గా నటించింది. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. శివ కేసనకుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించాడు. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో న్యూ ఏజ్ లవ్‌స్టోరీగా కొత్త మలుపు రూపొందింది. అనుమానాలు, అపోహలు జీవితాలను ఏ విధంగా అతలాకుతలం చేస్తాయనే మెసేజ్‌ను ఈ సినిమాతో ఇచ్చారు డైరెక్టర్. హీరోగా ఆకాష్ ఆకట్టుకున్నా కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమాతో అతడికి సక్సెస్ దక్కలేదు.
కమల్ అన్వేషణ...
కమల్ హైదరాబాదీ కుర్రాడు. ఓ పెళ్లి కోసం కోనసీమ వస్తాడు. అక్కడే అతడికి వరలక్ష్మి పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. తాను ప్రేమించిన వరలక్ష్మి సహాయంతోనే మరో అమ్మాయి జాడ కోసం కమల్ వెతుకుతుంటాడు. కమల్ వెతుకుతున్న అమ్మాయి, అతడు ప్రేమించిన వరలక్ష్మి ఒక్కరేనా? కమల్ ఓ పెద్ద సమస్యలో ఎలా చిక్కుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
సెకండ్ మూవీ...
ఆకాష్ హీరోగా నటించిన సెకండ్ మూవీ ఇది. సర్కారు నౌకరి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కమర్షియల్ హంగులకు దూరంగా రియలిస్టిక్ కథాంశాలను ఎంచుకుంటున్నాడు.
తాజావార్తలు
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
- ●RGI Airport | ప్రయాణీలకు యూడీఎఫ్ షాక్.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీఎంఆర్..!

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..



