Supreme Court | బొందికల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు..!
Supreme Court | కొందరు బొందికల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
Supreme Court | కొందరు బొందికల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ అడ్వకేట్ హోదా కోసం దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చి ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ఇప్పటికే సమాజంలో కొందరు దాడి చేసే పరాజన్నజీవులు ఉన్నారని.. వారితో కలవాలనుకుంటున్నారా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించారు. అయితే, సీనియర్ అడ్వకేట్ హోదా మార్గదర్శకాలను అమలు చేయడంలో ఢిల్లీ హైకోర్టు జాప్యం చేస్తోందని, ఈ మేరకు ధిక్కార చర్యలు తీసుకోవాలని న్యాయవాది సంజయ్ దుబే సుప్రీంకోర్టును కోరారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. సీనియర్ అడ్వకేట్ హోదా అనేది కోర్టు స్వయంగా ఇచ్చే గౌరమని, దాన్ని పిటిషన్ల ద్వారా కోరకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. “ప్రపంచంలో ఎవరికైనా ఆ హోదా ఇవ్వొచ్చు.. కానీ, మీ విషయంలో మాత్రం కాదు. హైకోర్టు ఇచ్చినా కూడా మీ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని మేం దాన్ని నిలిపివేస్తాం” అని సీజేఐ వ్యాఖ్యానించారు. పిటిషనర్ సోషల్ మీడియా వేదికగా ఉపయోగించిన భాషను సైతం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
న్యాయవ్యవస్థను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తాము గమనిస్తున్నామని, వాటిని తేలికగా తీసుకోవద్దని హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన కొందరు న్యాయవాదుల విద్యార్హతలపై అనుమానాలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశించే కేసు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. బార్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకోవడం లేదని కోర్టు అభిప్రాయపడింది. చివరకు పిటిషనర్ కోర్టును క్షమాపణలు కోరారు. తన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరారు. దాంతో సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్






