NEET-UG 2026 | నీట్ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్.. ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
NEET-UG 2026 | జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు (NEET Retest) లైన్ క్లియరైంది. ఈ పరీక్ష నిలిపివేయాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
NEET-UG 2026 | జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు (NEET Retest) లైన్ క్లియరైంది. ఈ పరీక్ష నిలిపివేయాలంటూ పలువురు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. పునఃపరీక్ష వల్ల తలెత్తిన సమస్యలపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలూ ఇప్పటికే జస్టిస్ పీఎస్ నరసింహ (Justice PS Narasimha) నేతృత్వంలోని బెంచ్ ముందుకు వెళ్లాయని జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కూడా ఆ ధర్మాసనమే విచారిస్తుందని చెప్పారు. ఈ మేరకు వీటిని అత్యవసరంగా విచారించలేదమని స్పష్టం చేశారు.
విచారణ సందర్భంగా పేపర్ లీకులపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న సంబంధిత విచారణల పరిణామాల వల్ల దాదాపు 1600 మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు, రీ టెస్ట్ అడ్మిట్ కార్డుల గురించి కూడా ఆందోళనలను ఉన్నాయని తెలిపారు. అయితే, న్యాయవాదుల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ నరసింహ బెంచే విచారిస్తుందని తేల్చి చెప్పింది.
Also Read..
రాహుల్ గారూ.. మాకిచ్చిన హామీలు మర్చిపోయారు : తెలంగాణ నిరుద్యోగ యువత
మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి
నీట్ రీటెస్టు.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
తాజావార్తలు
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ





