LPG Refill Gap | గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు.. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజులు ఆగాల్సిందే
LPG Refill Gap | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు (Domestic LPG) కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య (LPG Refill Gap |) వ్యవధిని మరింత పెంచింది.
LPG Refill Gap | త్రినేత్ర.న్యూస్: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు (Domestic LPG) కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్‌కు, సప్లయ్‌కి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటున్నది. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య (LPG Refill Gap) వ్యవధిని మరింత పెంచింది. రెండు సిలిండర్లు ఉంటే బుకింగ్ మధ్య వ్యవధి 35 రోజులు ఉంటుందని స్పష్టం చేసింది. ఈమేరకు చమురు సంస్థలు వెల్లడించాయి.
యుద్ధం నేపథ్యంలో గతంలో 21 రోజులుగా ఉన్న సిలిండర్ బుకింగ్ వ్యవధిని.. మార్చి రెండో వారంలో 25 రోజులకు పెంచారు. తాజాగా 35 రోజులకు పెంచారు. అయితే సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల వ్యవధి తర్వాతే మళ్లీ బుక్ చేసుకునే వీలుంటుందని తెలిపాయి. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) వినియోగదారులు కొత్త సిలిండర్ బుకింగ్ చేసేందుకు ఉన్న గడువును 45 రోజులకు పెంచారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులు మరో సిలిండర్ కోసం 35 రోజులపాటు వేచిచూడాల్సిందే.
ఇవికూడా చదవండి..
ఆ బడిలో ఒక్కడే విద్యార్థి.. అతనికీ గురుకులంలో సీటు..
వార్ ఎఫెక్ట్.. ఇక 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ సరఫరా..?
గ్యాస్ సరఫరాపై యుద్ధ ప్రభావం.. భారత్‌లో 30 రోజులకు సరిపడా మాత్రమే ఎల్పీజీ నిల్వలు..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
- ●JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్
- ●Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
- ●Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ
- ●Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..

JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్

Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ






