Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
Hardeep Singh Puri | దేశంలో వంటగ్యాస్ (cooking gas) కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశీయంగా వంటగ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించింది.
Hardeep Singh Puri | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో (Middle East) కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో మరోసారి ఎల్పీజీ సిలిండర్ల (LPG) కొరత ఏర్పడుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) కొట్టిపారేశారు. దేశీయంగా వంటగ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.
దేశీయంగా వంటగ్యాస్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఉత్పత్తిని భారీగా పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొంత ప్రభావం చూపిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి అంగీకరించారు. అయితే, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు చెప్పారు. ఇంతకుముందు ఆ ఉత్పత్తి 34 వేల టన్నులు ఉండగా.. ఇప్పుడు 55 వేల నుంచి 56 వేల టన్నులకు పెంచినట్లు వివరించారు. దేశీయంగా ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేశారు.
వినియోగదారులు వ్యక్తిగతంగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన పనిలేదని చెప్పారు. డిజిటల్ బుకింగ్ ద్వారా 24 గంటల్లోనే సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుందని స్పష్టం చేశారు. సాధారణంగా రోజుకు సగటున 52 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ జరుగుతున్నాయని.. అయితే కొరత వస్తుందనే పుకార్ల కారణంగా ఆ సంఖ్య ఒక్కసారిగా 90 లక్షలకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వదంతులు నమ్మి గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరొద్దని సూచించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Also Read..
వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ●Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్
- ●Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
- ●Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!

RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..






