Revanth Reddy | అదే జరిగితే దక్షిణాదితో సంబంధం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి.. 50 శాతం సీట్ల పెంపుపై సీఎం రేవంత్
Revanth Reddy | డీలిమిటేషన్‌పై (Delimitation) దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం సీట్ల పెంపు ఏ లెక్కన జరుగుతున్నదని ప్రశ్నించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: డీలిమిటేషన్‌పై (Delimitation) దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం సీట్ల పెంపు ఏ లెక్కన జరుగుతున్నదని ప్రశ్నించారు. అలా సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్ బుల్లెట్ అని చెప్పారు. చట్టసభల్లో 50 శాతం సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. అదే జరిగితే దక్షిణ భారత దేశంతో సంబంధం లేకుండానే ఉత్తర భారతంలోని నాలుగు రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావచ్చన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు. ఎంపీ స్థానాల విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. నియోజకవర్గాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకమని వెల్లడించారు. .
`తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. ఉత్తర, దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం పెంచుతున్నది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని` తెలిపారు.
మోదీది త్రీడీ పాలసీ..
ప్రధాని మోదీ (PM Modi) త్రీడీ పాలసీని అనుసరిస్తున్నారు. డీలిమిటేషన్, డిస్క్రిమినేషన్, డివల్యూషన్ అనే మూడు అంశాలతో కూడిన విధానాన్ని పాటిస్తున్నారు. దక్షిణ భారతానికి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యమున్న పోర్టుఫోలియోలు ఇవ్వడంలేదు. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు. ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్‌ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదని విమర్శించారు.
మోదీ గుజరాత్ నుంచి వచ్చి యూపీలో పోటీ చేసి ప్రధానమంత్రి అవ్వొచ్చు. మరి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వెంకయ్యకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్‌కు పంపించేశారన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నారు. భారత్ అంతా ఒక్కటేనని భావించాలి కదా?. ఎందుకు సమతౌల్యం పాటించరు అని నిలదీశారు. గతంలో దక్షిణ భారతం నుంచి జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా పనిచేశారు. గత 12 ఏండ్ల మోదీ పాలనలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాధాన్యమున్న పదవుల్లో ఎవరిని తీసుకున్నారు. మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాజావార్తలు
- ●Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
- ●JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్
- ●Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
- ●Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ
- ●Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..

JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్

Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ






