10 kg LPG | వార్ ఎఫెక్ట్.. ఇక 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ సరఫరా..?
10 kg LPG | వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (oil companies) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సిలిండర్ బరువును (LPG cylinder) తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
10 kg LPG | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో అక్కడ పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. అదే సమయంలో ఈ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇంధన కొరత ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మనదేశంలో గత రెండు వారాలుగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (oil companies) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సిలిండర్ బరువును (LPG cylinder) తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14 కేజీల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎల్పీజీ సరఫరా కొరతను అధిగమించేందుకు దీనిని 10 కిలోలకు (10 kg LPG) తగ్గించే యోచనలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీని నింపి సరఫరా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎల్పీజీ పరిమాణాన్ని బట్టి ధరలను కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 913గా ఉండగా.. ముంబైలో రూ.912.50గా ఉంది. అదే హైదరాబాద్‌లో రూ.965గా ఉంది.
Also Read..
మధ్యప్రాచ్యంలో యుద్ధం భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది : ప్రధాని మోదీ
మార్కెటింగ్ శక్తిని చాటిన ఐపీఎల్.. రూ.1వేయి కోట్లు దాటిన జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం..
ఫారిన్ ప్లేయర్లకు బెదిరింపులు..!| పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై నీలినీడలు..!
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి
- ●Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్
- ●Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
- ●Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి
- ●Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
- ●Vakiti Srihari | క్రీడల్లో ఎందుకు వెనకబడ్డమో యువత ఆలోచించాలి

Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి

Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్

Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!

Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి






