త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | ఏడాదికి 3 సిలిండ‌ర్లు.. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. సీఎం వ‌రాల జ‌ల్లు

CM Vijay | ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay) ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు. రూ. 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను (LPG cylinders) అందించ‌నున్న‌ట్లు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌జెండ‌ర్ల‌ (transgenders)కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 'వెట్రి పయన తిట్టం' ప‌థ‌కాన్ని కూడా విస్త‌రించారు.

D

National | Published On Aug 24, 2026, 11.30 am IST

CM Vijay | ఏడాదికి 3 సిలిండ‌ర్లు.. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. సీఎం వ‌రాల జ‌ల్లు
Advertisement

CM Vijay | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడులో విజ‌య్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ఫోక‌ప్ పెంచింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే దిశ‌గా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రూ. 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను (LPG cylinders) అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇవాళ ఉద‌యం అసెంబ్లీలో ఉచిత ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి విజ‌య్ ప్ర‌క‌టించారు. 'అన్నపూర్ణి సూపర్ సిక్స్' పథకాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కం ద్వారా సుమారు 1.30 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన ల‌బ్ధిదారులు కొనుగోలు చేసిన మూడు ఎల్‌పీజీ సిలిండ‌ర్ల ఖ‌ర్చును నేరుగా వారి బ్యాంకు ఖాతాల‌కే ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నుంది. ఈ ప‌థ‌కం వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాపై ఏటా సుమారు రూ.4,000 కోట్ల భారం ప‌డుతుంద‌ని అంచ‌నా.

గ‌ల్ఫ్ ప్రాంతంలో నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల కార‌ణంగా వంట గ్యాస్ సిలిండ‌ర్ల కొత‌ర ఏర్ప‌డ‌టం, వాటి ధ‌ర‌లు పెర‌గ‌డం వంటి అంశాలు సామాన్య ప్ర‌జ‌ల‌పై అధిక భారాన్ని మోపాయ‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా క్లిష్ట ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారాన్ని త‌గ్గించడం, ప్ర‌జా సంక్షేమాన్ని కాపాడ‌టం, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని నెరవేర్చే ల‌క్ష్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం..

ఈ సంద‌ర్భంగా విజ‌య్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌జెండ‌ర్ల‌ (transgenders)కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 'వెట్రి పయన తిట్టం' ప‌థ‌కం కింద ఇప్పటికే సాధారణ ప్రభుత్వ బస్సుల్లో మహిళల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం విస్త‌రించింది. ఈ ప‌థ‌కం కింద మ‌హిళ‌లు సాధార‌ణ బ‌స్సుల్లోనే కాకుండా ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్ స‌ర్వీసుల్లో కూడా ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించింది. ఈ ప్ర‌యోజ‌నం అంతర్-జిల్లా బస్సు సర్వీసులకు కూడా వర్తిస్తుంద‌ని సీఎం తెలిపారు. ఈ నిర్ణ‌యం అక్టోబ‌ర్ 2 నుంచి అమ‌ల్లోకి రానుంది.

ప‌రందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ర‌ద్దు..

సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటూ సీఎం విజ‌య్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. చెన్నై శివార్ల‌లోని ప‌రందూర‌న్‌లో కొత్త విమానాశ్ర‌యం నిర్మించాల‌న్న ప్రతిపాదనను విర‌మించుకుంటున్నట్లు తెలిపారు. విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి తమ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా సీఎం స్పష్టం చేశారు. 'పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును విరమించుకుంటున్నాం. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకు మేము అండగా ఉంటా' అని విజయ్ పేర్కొన్నారు.

Also Read..

ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..

అమరావతి హాస్పిట‌ల్‌లో పేలిన వెంటిలేట‌ర్‌.. ముగ్గురు నవజాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

స్వ‌ల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. త‌గ్గిన ముడి చ‌మురు ధ‌ర‌లు..

Advertisement
Advertisement