LPG stocks | గ్యాస్ సరఫరాపై యుద్ధ ప్రభావం.. భారత్‌లో 30 రోజులకు సరిపడా మాత్రమే ఎల్పీజీ నిల్వలు..!
LPG stocks | మధ్య ప్రాచ్యంలో యుద్ధం (Middle East war) భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దేశంలో ఎల్పీజీ నిల్వలు 30 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
LPG stocks | మధ్య ప్రాచ్యంలో యుద్ధం (Middle East war) రోజురోజుకూ ముదురుతున్నది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధి (Strait Of Hormuz) స్తంభించిపోయింది. ఈ జలసంధి గుండా సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇక ఈ యుద్ధం భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత్ ఎల్పీజీ అవసరాల్లో సుమారు 80 నుంచి 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల (Gulf Countries) నుంచే వస్తుంది. అయితే, ప్రస్తుతం యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని (Strait Of Hormuz) ఇరాన్ మూసివేసింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలను పేల్చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో రవాణా ఆగిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ వద్ద ఎల్పీజీ నిల్వలు (LPG stocks) నిండుకున్నట్లు తెలిసింది. దేశంలో ఎల్పీజీ నిల్వలు 30 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి నెలలో రావాల్సిన గ్యాస్ కార్గోలు ఆలస్యమైనా, ఆగిపోయినా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ భయంతో ప్రజలు ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఉన్న నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ వద్ద ఎల్పీజీ నిల్వలు తక్కువ..
కెప్లర్ (Kpler) సంస్థ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా మాట్లాడుతూ.. ముడి చమురుతో పోలిస్తే భారత్ వద్ద భారీ స్థాయిలో వ్యూహాత్మక ఎల్పీజీ నిల్వ సామర్థ్యం లేదన్నారు. దీనివల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే.. ఎల్పీజీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీని సేకరించే విషయంలో భారత్‌కు పరిమితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా, రష్యా, అర్జెంటీనా వంటి దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదుతో కూడుకున్నది. అంతేకాదు సరిపడా గ్యాస్ దొరకడం కూడా కష్టమే అని ఆయన వివరించారు.
ప్రజలు గ్యాస్ నిల్వ చేయొద్దు..
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం.. తాజా పరిస్థితి నేపథ్యంలో వినియోగదారులు గ్యాస్ స్టాక్ పెట్టుకుంటున్నారు. ముందుగానే సిలిండర్ బుక్ చేసుకుని భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ నిల్వ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నిల్వలు పూర్తిగా తగ్గిపోకముందే.. ఇలా ముందుగానే బుకింగ్ చేసుకోవడం వల్ల సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా గ్యాస్ లభ్యత కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎందుకీ సమస్య..
భారత్ వద్ద చమురు నిల్వలకు ఉన్న వనరులు గ్యాస్ నిల్వలకు లేకపోవడే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఫలితంగా మధ్యప్రాచ్య యుద్ధం భారత వంటిళ్లపై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. వంట గ్యాస్ సిలిండర్ల లభ్యత, ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. భారత్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపు 90 శాతానికిపైగా మధ్య ప్రాచ్య దేశాల నుంచే కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం హర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు వచ్చే పరిస్థితి లేదు. సాధారణంగా ఈ జలసంధి గుండానే భారత్ రోజుకు సుమారు 25 లక్షల నుంచి 27 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇది ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ నుంచే వస్తుంది.అమెరికా ఒత్తిళ్ల కారణంగా రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు పరిణామాన్ని భారత్ తగ్గించిన విషయం తెలిసిందే. గత రెండు, మూడు నెలలుగా భారతీయ రిఫైనరీలు మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతిని పెంచాయి.
Also Read..
Nitish Kumar | రాజ్యసభకు వెళ్తున్నా : నితీశ్ కుమార్
Sonu Sood | వార్ వేళ వారికి ఉచిత బస.. మరోసారి మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోనూసూద్
Gold Silver Prices | పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి
- ●Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్
- ●Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
- ●Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి
- ●Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
- ●Vakiti Srihari | క్రీడల్లో ఎందుకు వెనకబడ్డమో యువత ఆలోచించాలి

Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి

Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్

Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!

Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి






