త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Government School | ఆ బ‌డిలో ఒక్క‌డే విద్యార్థి.. అత‌నికీ గురుకులంలో సీటు..

Government School | రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల (Government School) ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఎప్పుడు ఏ బ‌డి మూత‌ప‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు ఉండ‌రు.. స్టూడెంట్స్ ఉంటే స‌రైన వ‌స‌తులు ఉండ‌వు.

G

Telangana | Published On Mar 25, 2026, 7.32 am IST

Government School | ఆ బ‌డిలో ఒక్క‌డే విద్యార్థి.. అత‌నికీ గురుకులంలో సీటు..
Advertisement

Government School | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల (Government School) ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఎప్పుడు ఏ బ‌డి మూత‌ప‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు ఉండ‌రు.. స్టూడెంట్స్ ఉంటే స‌రైన వ‌స‌తులు ఉండ‌వు. అన్నీ ఉన్నా టీచ‌ర్లు ప‌నితీరు బాగుండ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ప్రైవేటు బాట‌ప‌డుతున్నారు. దీంతో గ్రామాల్లో స‌ర్కారు బడులు మూసివేత దిశ‌గా ప‌య‌ణిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితే నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కోడేరు మండ‌లం జ‌నుంప‌ల్లి (Janumpally) పంచాయ‌తీ ప‌రిధిలోని వార్ల‌గుడిసెలు గ్రామ పాఠ‌శాల‌లో చోటుచేసుకున్న‌ది. అక్క‌డ చ‌దువుతున్న ఒక్క విద్యార్థికీ.. గురుకులంలో సీటు రావ‌డంతో అత‌డూ పాఠ‌శాల‌ను వీడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

గ్రామంలోని పాఠశాలలో ఎనిమిదేండ్ల‌ కిందట ఉపాధ్యాయుడు రాజు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అక్కడి విద్యార్థులు కోడేరు, ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి 2025 ఏప్రిల్‌ వరకు ఈ బడి మూతబడింది. అయితే ఒక్క విద్యార్థి ఉన్నా పాఠాలు చెప్పాలని ప్రభుత్వం గ‌తేడాది ఆదేశించింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నలుగురు విద్యార్థులు పాఠ‌శాల‌లో చేరారు. ఈ నేప‌థ్యంలో పక్కనే ఉన్న పసుపుల పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై ఎస్జీటీ ఉపాధ్యాయుడు నరేశ్‌ను అక్కడ నియమించారు.

అయితే నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు మధ్యలోనే ప్రైవేట్ స్కూలుకు వెళ్లిపోయారు. దీంతో అశోక్ అనే ఒక్క విద్యార్థి మాత్ర‌మే మిగిలాడు. ఒక్కడే విద్యార్థి అని నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయుడు నరేశ్ చ‌క్క‌గా బోధించడంతో పెద్దకొత్తపల్లి గురుకులంలో అత‌నికి సీటు వచ్చింది. దీంతో ఉన్న ఒక్క‌డు కూడా స్కూలు నుంచి వెళ్లిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో బ‌డి భ‌విత‌వ్యంపై సందిగ్ధ‌త ఏర్ప‌డింది.

Advertisement
Advertisement