Annamalai | తమిళనాడులో బీజేపీకి షాక్.. అన్నామలై రాజీనామా
Annamalai | తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ ఐపీఎస్ (IPS) అధికారి కె. అన్నామలై (K Annamalai) కమలం పార్టీకి రాజీనామా చేశారు.
Annamalai | తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ ఐపీఎస్ (IPS) అధికారి కె. అన్నామలై (K Annamalai) కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (BJP President Nithin Nabin), జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు. ఏకంగా ఐదు పేజీల రాజీనామా లేఖను అందించారు. తమిళనాడులో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి, పార్టీ వైఫల్యానికి గల కారణాలను లేఖలో వివరించినట్లు సమాచారం.
ఆ తర్వాత అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ని కూడా కలిశారు. అయితే, పార్టీలోనే కొనసాగాలంటూ అధిష్టానం ఆయనను కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన రాజీనామాను ఆమోదించలేదని తెలిసింది. పార్టీ నిర్ణయం వెలువడే వరకూ ఢిల్లీలోనే ఉండాలని అన్నామలైకి అధిష్టానం సూచించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం, ఆ తర్వాత పార్టీలో తనకు తగిన గుర్తింపు, ముఖ్యంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్ చేయగా.. దాన్ని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాజీనామా అనంతరం అన్నామలై ఏ పార్టీలోనూ చేరరని.. ఆయన ఓ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జాతీయవాద భావజాలంతో తొలుత ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి, భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read..
డీకేతో ఒప్పందం.. రాజీనామా చేసినా సీఎం బంగ్లాలోనే సిద్ధరామయ్య..!
వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లండి.. ఎబోలాపై కేంద్రం కీలక అడ్వైజరీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Actor Ajith | అజిత్‌ను పరామర్శించిన సీఎం విజయ్, త్రిష
మే 31, 2026

Bribes For Speed Darshan | ఆలయాల్లో వీఐపీ దర్శనం పేరుతో అడ్డగోలు వసూళ్లు.. మారువేషంలో వెళ్లి షాకిచ్చిన మంత్రి
మే 30, 2026

Annamalai | నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది.. సెలబ్రేషన్ మూడ్ నుంచి బయటకు రండి.. విజయ్‌పై అన్నామలై ధ్వజం
మే 26, 2026
తాజావార్తలు
- ●Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ●dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్
- ●NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?
- ●RTC MD Nagireddy | రాష్ట్ర ప్రగతిలో ఆర్టీసీ భాగమవడం గర్వకారణం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- ●One India-One Nation | ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అమలుకు కేంద్రం కసరత్తు

Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి

dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి

Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్

NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?



