Ebola | వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లండి.. ఎబోలాపై కేంద్రం కీలక అడ్వైజరీ
Ebola | ప్రాణాంతక వైరస్ ఎబోలా (Ebola) వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది (Govt Issues Ebola Warning). ఎబోలా ప్రభావిత దేశాల నుంచి లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Ebola | ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉగాండా (Uganda) సహా పలు దేశాల్లో ప్రాణాంతక వైరస్ ఎబోలా (Ebola) విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది (Govt Issues Ebola Warning).
మన దేశంలో ప్రస్తుతం ఎలాంటి ఎబోలా కేసులూ నమోదు కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) మంగళవారం కొత్త మార్గదర్శనాలకు జారీ చేసింది.
“మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశం నుంచి వచ్చినా లేదా ఆ దేశం మీదుగా ప్రయాణించినా.. ఒకవేళ మీకు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా ఎలాంటి కారణం లేకుండా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోండి. అంతేకాదు, వెంటనే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించండి. ముందుగానే సమాచారం అందించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాధి వ్యాప్తిని అరికట్టొచ్చు” అని మంత్రిత్వ శాఖ అడ్వైజరీలో తెలిపింది. సహాయం కోసం 1075 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
Also Read..
సుస్మిత సేన్ 'గోల్డ్ డిగ్గర్' కాదు.. నేనే ఆమె సంపాదనపై ఆధారపడేవాడిని : లలిత్ మోదీ
స్పిరిట్‌పై కొత్త అప్‌డేట్ - ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త
పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..






