One India-One Nation | ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అమలుకు కేంద్రం కసరత్తు
One India-One Nation | దేశంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రెండు దశల ప్రణాళికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చర్చిస్తున్నది.
- నివేదిక సమర్పించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ
- పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ
- పార్లమెంట్ మాన్‌సూన్ సమావేశాల్లో చర్చించే ఛాన్స్
One India-One Nation | దేశంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రెండు దశల ప్రణాళికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చర్చిస్తున్నది. 2029లో తొలి దశను ప్రారంభించి, 2034 నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని స్వల్పంగా పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను సమన్వయం చేయాలని భావిస్తోంది. 2028 ఎలక్ట్రోరల్ సైకిల్‌లో ఉన్న తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీల గడువు పొడిగించే అవకాశం ఉండగా, బిహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పదవీకాలం కుదించే అవకాశం ఉన్నది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 2029 సైకిల్‌లో ఉన్న ఉన్న రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. జమిలి ఎన్నికలకు రాజ్యాంగపరమైన వెసులుబాటు ఉన్నప్పటికీ, చట్టసవరణలతో పాటు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చులు, పరిపాలనా భారం తగ్గుతాయని అనుకూల వర్గాలు వాదిస్తుండగా.. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, ప్రజా తీర్పుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించిన విషజ్ఞం తెలిసిందే. ప్రస్తుతం ఆ నివేదికను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ.. ఈ ఏడాది జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశం వరకు తుది నివేదికను ఇవ్వనుంది. అనంతరం ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..
- ●Pawan Kalyan | తెలంగాణలో జనసేన ఉంటుంది.. నేను తిరుగుతా : పవన్ కల్యాణ్
- ●Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? - బెనిఫిట్ షోలకు పర్మిషన్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ
- ●Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ

Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..

Pawan Kalyan | తెలంగాణలో జనసేన ఉంటుంది.. నేను తిరుగుతా : పవన్ కల్యాణ్

Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? - బెనిఫిట్ షోలకు పర్మిషన్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..





