Siddaramaiah | డీకేతో ఒప్పందం.. రాజీనామా చేసినా సీఎం బంగ్లాలోనే సిద్ధరామయ్య..!
Siddaramaiah | ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా.. సిద్ధరామయ్య (Siddaramaiah) సీఎం బంగ్లా (CM bungalow) అయిన ‘కావేరి’ (Cauvery)లోనే నివాసం ఉండనున్నట్లు తెలిసింది. ‘కావేరి’ విషయంలో డీకే-సిద్ధూ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. 2028 వరకూ సిద్ధూ సీఎం బంగ్లాలోనే నివాసం ఉండనున్నారు.
Siddaramaiah | కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజీనామా చేసినా కూడా సిద్ధరామయ్య సీఎం బంగ్లా (CM bungalow) అయిన ‘కావేరి’ (Cauvery)లోనే నివాసం ఉండనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అధికారిక నివాసానికి సంబంధించి ఇద్దరు నేతలూ పరస్పర అవగాహనకు వచ్చారు. ‘కావేరి’ విషయంలోఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. 2028 వరకూ సిద్ధూ సీఎం బంగ్లాలోనే నివాసం ఉండనున్నారు. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టబోయే డీకే శివకుమార్ కోసం అధికారులు వేరే అధికారిక నివాసం ఏర్పాటు చేయనున్నారు. అప్పటి వరకూ ఆయన తన ప్రైవేట్ నివాసం నుంచే కార్యకలాపాలు సాగించనున్నారు.
కాగా, కర్ణాటక రాజకీయ చరిత్రలో ఇలాంటి సర్దుబాటు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. చాలా కాలం పాటూ సీఎం అధికారిక నివాసంలోనే కొనసాగారు.
రేపే సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..
ఇదిలా ఉండగా.. డీకే ప్రమాణస్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది. జూన్ 3 అంటే రేపు ఆ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు లోక్‌భవన్‌లో ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read..
వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లండి.. ఎబోలాపై కేంద్రం కీలక అడ్వైజరీ
సుస్మిత సేన్ 'గోల్డ్ డిగ్గర్' కాదు.. నేనే ఆమె సంపాదనపై ఆధారపడేవాడిని : లలిత్ మోదీ
స్పిరిట్‌పై కొత్త అప్‌డేట్ - ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ
- ●Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ
- ●Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ●dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ

Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ

Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి






