Former Judges Write Open Letter | ఈసీని అస్థిరపరిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు.. నిరసనల వేళ ఈసీకి మద్దతుగా రిటైర్డ్ జడ్జీలు
Former Judges Write Open Letter | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలను కొనసాగుతున్న వేళ ఈసీకి మాజీ న్యాయమూర్తులు (Former Judges) మద్దతుగా నిలిచారు. సర్‌తోపాటూ ఈసీ నిర్ణయాల్ని సమర్థిస్తూ దాదాపు 42 మంది రిటైర్డ్ జడ్జీలు బహిరంగ లేఖ విడుదల చేశారు (Former Judges Write Open Letter). ఈసీని అస్థిరపరిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు అని అందులో తీవ్రంగా హెచ్చరించారు.
Former Judges Write Open Letter | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో అక్రమాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సర్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ యువత, విపక్షాలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల వేళ ఈసీకి మాజీ న్యాయమూర్తులు (Former Judges) మద్దతుగా నిలిచారు. సర్‌తోపాటూ ఈసీ నిర్ణయాల్ని సమర్థిస్తూ దాదాపు 42 మంది రిటైర్డ్ జడ్జీలు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈసీని అస్థిరపరిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు అని అందులో తీవ్రంగా హెచ్చరించారు.
ఆధారాలు లేని ఆరోపణలు సరికాదు
ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను అస్థిరపరుస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో సంస్థల ప్రతిష్టను దిగజార్చడం సరికాదని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అధికారులను పదేపదే దొంగలు, కీలుబొమ్మలు, అమ్ముడుపోయారంటూ నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ పట్ల నమ్మకం సన్నగిల్లితే.. ఆ అశాంతిని వీధులు ఆక్రమిస్తాయన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల ఏర్పడే శూన్యాన్ని అరాచక, విపరీత శక్తులు ఆక్రమించే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి.. వరుసగా మూడో రోజు.. రాజ్‌ఘాట్‌వైపు కదిలిన విపక్ష ఎంపీలు.. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం
ఓడిపోయినప్పుడు ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడం ఏంటి..?
ప్రజాస్వామ్యంలో సంస్థల పనితీరుపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యవస్థల మనుగడను దెబ్బతీసేలా, వాటిని అస్థిరపరిచేలా నిరసనలు తెలపడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడం, అదే ఈవీఎంలతో విజయం సాధించినప్పుడు మౌనంగా ఉండటంపై ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణ అనేది పూర్తి చట్టబద్ధమైన, పారదర్శకమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాను మరింత స్పష్టంగా, ఖచ్చితంగా మార్చడానికే ఈ ప్రక్రియ ఉద్దేశించబడిందని వారు లేఖలో పేర్కొన్నారు.
సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించండి..
సంస్థలను బలహీనపరచడానికి బదులు.. తమ సమస్యలను సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘం, కోర్టుల వద్ద నిరూపించాలని సూచించారు. "రాజ్యాంగ సంస్థలు ఏ ఒక్క ప్రభుత్వానికో చెందినవి కావు. అవి భారతదేశ ప్రజలందరికీ చెందినవి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మౌనంగా ఉండటం సరికాదు. అందుకే మేము ఈ లేఖ రాస్తున్నాము. మా ఆందోళన చాలా తీవ్రమైనది. భారతదేశ రాజ్యాంగ సంస్థలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి" అని న్యాయమూర్తులు తమ లేఖలో పేర్కొన్నారు.
Also Read..
దసరాకు ఊరెళ్తున్నారా..? 30 మంది ఉంటే మీ ఇంటికే ఆర్టీసీ బస్సు..!
పండుగల వేళ ప్రయాణిలకు శుభవార్త.. గుంటూరు, యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ





