త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | పండుగ‌ల వేళ ప్ర‌యాణిల‌కు శుభ‌వార్త‌.. గుంటూరు, య‌శ్వంత్‌పూర్‌కు ప్ర‌త్యేక రైళ్లు

Special Trains | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ప్రత్యేక రైళ్లను నడపనుంది. వివిధ గమ్యస్థానాల మధ్య ఈ ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో గుంటూరు–వికారాబాద్‌–గుంటూరు మధ్య రెండు సర్వీసులు న‌డుప‌నుంది.

P

Telangana | Published On Oct 8, 2026, 4.21 pm IST

Special Trains | పండుగ‌ల వేళ ప్ర‌యాణిల‌కు శుభ‌వార్త‌.. గుంటూరు, య‌శ్వంత్‌పూర్‌కు ప్ర‌త్యేక రైళ్లు
Advertisement

Special Trains | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ప్రత్యేక రైళ్లను నడపనుంది. వివిధ గమ్యస్థానాల మధ్య ఈ ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో గుంటూరు–వికారాబాద్‌–గుంటూరు మధ్య రెండు సర్వీసులు న‌డుప‌నుంది. అలాగే, యశ్వంత్‌పూర్‌–అమృత్‌సర్‌ మధ్య ఒక స‌ర్వీసు న‌డిపించ‌నున్న‌ట్లు వివ‌రించింది. రైలు నంబర్‌ 07227 గుంటూరు నుంచి వికారాబాద్‌కు రాత్రి 9.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుతుంది. ఈ రైలు అక్టోబర్‌ 8, 10 తేదీల్లో నడుస్తుంది. రైలు నంబర్‌ 07228 వికారాబాద్‌ నుంచి గుంటూరుకు రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు గుంటూరు చేరుతుంది. ఈ రైలు అక్టోబర్‌ 9, 11 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, చర్లపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి. రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయ‌ని వివ‌రించింది.

యశ్వంత్‌పూర్‌–అమృత్‌సర్‌ ప్రత్యేక రైలు

రైలు నంబర్‌ 06539 యశ్వంత్‌పూర్‌ నుంచి అమృత్‌సర్‌కు అక్టోబర్‌ 8న రాత్రి 10.40 గంటలకు బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు అమృత్‌సర్‌ చేరుతుంది. ఈ రైలు యలహంక, హిందూపూర్‌, ధర్మవరం, అనంతపూర్‌, గుంతకల్‌, ఆదోని, మంత్రాలయం రోడ్‌, రాయచూర్‌, వాడి, కాలబురగి, సోలాపూర్‌, కుర్దువాడి, దౌండ్‌, అహిల్యానగర్‌, కోపర్‌గావ్‌, మన్మాడ్‌, భుసావల్‌, ఖండ్వా, ఇటార్సీ, జబల్‌పూర్‌, కట్ని, సత్నా, చిత్రకూట్‌ధామ్‌ కర్వీ, బాందా, వీజీఎల్‌ ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా కాంట్‌, హెచ్ నిజాముద్దీన్‌, న్యూఢిల్లీ, అంబాలా కాంట్‌, లూధియానా, జలంధర్‌ సిటీ, బియాస్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. పండుగల సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు, వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి అదనపు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను న‌డుపుతున్న‌ట్లుగా ద‌క్షిణ మ‌ధ్య‌రైల్వే వివ‌రించింది. ఆయా రైళ్ల సేవ‌ల‌ను ప్ర‌యాణికులు వినియోగించుకోవాల‌ని కోరింది.

Advertisement
Advertisement