త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

vivo X Fold6 | వివో ఎక్స్ ఫోల్డ్6 వచ్చేసింది.. ఫీచర్లు అదిరిపోయాయ్‌..

vivo X Fold6 | వివో ఇండియా తన తాజా ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్6ను అధికారికంగా పరిచయం చేసింది. ఉత్పాదకత, మల్టీటాస్కింగ్, హైఎండ్ ఇమేజింగ్ సామర్థ్యాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వివో ఎక్స్ ఫోల్డ్6లో డ్యుయల్ జైస్ మాస్టర్ కలర్ డిస్‌ప్లేలను అందించారు. ఇందులో ప్రధాన ఇంటర్నల్ స్క్రీన్ 8.02 ఇంచులు.., అంటే 20.38 సెంటీమీటర్ల డిస్‌ప్లేతో వస్తుంది.

S

Technology | Published On Oct 8, 2026, 4.18 pm IST

vivo X Fold6 | వివో ఎక్స్ ఫోల్డ్6 వచ్చేసింది.. ఫీచర్లు అదిరిపోయాయ్‌..
Advertisement

vivo X Fold6 | వివో ఇండియా తన తాజా ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్6ను అధికారికంగా పరిచయం చేసింది. ఉత్పాదకత, మల్టీటాస్కింగ్, హైఎండ్ ఇమేజింగ్ సామర్థ్యాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వివో ఎక్స్ ఫోల్డ్6లో డ్యుయల్ జైస్ మాస్టర్ కలర్ డిస్‌ప్లేలను అందించారు. ఇందులో ప్రధాన ఇంటర్నల్ స్క్రీన్ 8.02 ఇంచులు.., అంటే 20.38 సెంటీమీటర్ల డిస్‌ప్లేతో వస్తుంది. బయట ఉండే కవర్ స్క్రీన్ 6.51 ఇంచులు, అంటే 16.53 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. రెండు డిస్‌ప్లేలు కూడా 1 హెడ్జ్ నుంచి 120 హెడ్జ్‌ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. గరిష్టంగా 5,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను ఇస్తాయి. అందువ‌ల్ల ఔట్ డోర్ విజిబిలిటీ కూడా స్ప‌ష్టంగా ఉంటుంది.

ప్ర‌త్యేకంగా క‌మ్యూనికేష‌న్ చిప్ సెట్‌..

ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనిని వివోతో కలిసి అభివృద్ధి చేయగా, ప్రొప్రైటరీ అల్ట్రా-ఎఫిషియెంట్ కన్‌కరెంట్ ఇంజిన్‌తో జత చేశారు. సెల్యులార్, వైఫై కనెక్షన్ల మధ్య మార్పిడిని మెరుగుపరిచేందుకు 1+4 కమ్యూనికేషన్ చిప్‌సెట్‌ను అందించారు. పర్యావరణ పరిస్థితుల నుంచి రక్షణ కోసం ఫోన్‌కు ఐపీఎక్స్8, ఐపీఎక్స్9 వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు ఐపీ5ఎక్స్ డస్ట్, ఫ్రీజ్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌ ఆరిజిన్‌ఓఎస్ 7పై పనిచేస్తుంది. పెద్ద ఫోల్డబుల్ డిస్‌ప్లేకు అనుగుణంగా పలు ప్రత్యేక టూల్స్‌ను ఇందులో అందించారు. ఆరిజిన్ వర్క్‌బెంచ్, మల్టీ-స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ల ద్వారా ఒక ప్రధాన పనితోపాటు ఒకేసారి నాలుగు సపోర్టింగ్ యాప్‌లను కూడా రన్ చేయవచ్చు. స్క్రీన్‌పై వీటి పరిమాణాలను అవసరానికి అనుగుణంగా మార్చుకునే సదుపాయం ఉంటుంది.

ఏఐ క్రాస్‌-యాప్ డ్రాగ్ ఫీచ‌ర్‌..

ఏఐ క్రాస్-యాప్ డ్రాగ్ ఫీచర్ ద్వారా అనుకూలమైన యాప్‌ల మధ్య టెక్స్ట్, మీడియాను నేరుగా బదిలీ చేయవచ్చు. ఉదాహరణకు ఫొటోలోని టెక్స్ట్‌ను నేరుగా తీసుకుని ట్రాన్స్‌లేషన్ టూల్‌లోకి పంపించవచ్చు. క్రాస్ డివైస్ వర్క్‌ఫ్లోలో భాగంగా ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేకు కీబోర్డ్, మౌస్ ద్వారా కనెక్ట్ చేసి మల్టీ-విండో సెటప్‌ను ఉపయోగించేందుకు డెస్క్‌టాప్ మోడ్‌ను అందించారు. వివో ఆఫీస్ కిట్ ద్వారా పీసీ ఇంటిగ్రేషన్, జోవి ద్వారా సిస్టమ్ అసిస్టెన్స్ కూడా లభిస్తుంది. మీటింగ్‌లు, డాక్యుమెంట్ల కోసం ఏఐ రికార్డర్ స్పీకర్ల మాటలను ట్రాన్స్‌క్రైబ్ చేసి సారాంశాలను రూపొందిస్తుంది. ఏఐ క్యాప్షన్స్ వీడియో కాల్స్‌లో రియల్‌టైమ్ సబ్‌టైటిల్స్ అందిస్తుంది. స్మార్ట్ కాల్ అసిస్టెంట్, ఏఐ ఫైల్ మేనేజర్‌తోపాటు పీడీఎఫ్‌లను ఈబుక్ ఫార్మాట్‌లోకి మార్చే ఏఐ రీడర్ మోడ్ కూడా ఉన్నాయి. జైస్‌తో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా వ్యవస్థకు వివో వీ3+ ఇమేజింగ్ చిప్ మద్దతు ఇస్తుంది. ఇందులో 200 మెగాపిక్స‌ల్ జైస్ మెయిన్ కెమెరాను అందించారు. దీనికి జైస్ టీ స్టార్ కోటింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఓఐఎస్ సపోర్ట్ ఉన్నాయి.

100 రెట్ల వ‌ర‌కు డిజిట‌ల్ జూమ్‌..

టెలిఫొటో కెమెరాగా జైస్ ఏపీఓ టెలిఫోటో కెమెరాను ఉపయోగించారు. ఇందులో సోనీ ఎల్‌వైటీఐఏ 602 సెన్సార్, వివో వీసీఎస్ టెక్నాలజీ ఉన్నాయి. టెలిఫొటో మ్యాక్రో ఫీచర్‌తో పాటు 100 రెట్ల వరకు డిజిటల్ జూమ్ సదుపాయం ఉంది. మోషన్ పోర్ట్రెయిట్ 2.0, నైట్ ఫ్లాష్ పోర్ట్రెయిట్ వంటి సాఫ్ట్‌వేర్ మోడ్‌లు కూడా ఉన్నాయి. డాల్బీ విజన్‌తో సెకనుకు 60 ఫ్రేమ్‌ల వేగంతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఫోల్డబుల్ ఫోన్‌కు ప్రత్యేకంగా కవర్ స్క్రీన్ టెలీప్రాంప్టర్, ఫొటోలు లేదా వీడియోలు తీసే సమయంలో స్ప్లిట్-స్క్రీన్ ప్రివ్యూ వంటి ఫీచర్లను అందించారు. ఇందులో 6,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో ఐదో తరం సిలికాన్ యానోడ్ టెక్నాలజీతోపాటు తక్కువ ఉష్ణోగ్రతల్లో స్థిరత్వం కోసం మూడో తరం సెమీ-సాలిడ్-స్టేట్ కెమిస్ట్రీని ఉపయోగించారు. ఈ ఫోన్ 80 వాట్ల వైర్డ్ ఫ్లాష్‌ఛార్జ్, 40 వాట్ల వైర్‌లెస్ ఫ్లాష్‌ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది.

మ‌రింత మెరుగ్గా క‌నెక్టివిటీ..

ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంది. వెనుక‌ వైపు 200 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా ఉంది. 50 మెగాపిక్స‌ల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. 50 మెగాపిక్స‌ల్ 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. లోపలి, బయటి భాగాల్లో 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ58, ఐపీ59, ఐపీఎక్స్8, ఐపీఎక్స్9 రేటింగ్‌లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.4 ఎల్‌ఈ, ఎల్1 ప్లస్ ఎల్5 డ్యుయల్-బ్యాండ్ జీపీఎస్, బీడూయ్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్, నావిక్, ఎన్‌ఎఫ్‌సీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

వివో ఎక్స్ ఫోల్డ్6 నెబ్యులా టీల్, ప్రిజమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ ధర రూ.2,19,1999గా కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఈ ఫోన్ అక్టోబర్ 13 నుంచి విక్రయానికి రానుంది. వివో ఇండియా ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతోపాటు భాగస్వామ్య రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ప్రీ-బుకింగ్స్ ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. వివో రిటైల్ ఛానళ్లలో పలు లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు 30 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. దీని కింద నెలకు రూ.7,333 చెల్లించే అవకాశం ఉంటుంది. అదనంగా రూ.26,400 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా వివో వి-అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద 12 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఆన్‌లైన్ కొనుగోలుదారులకు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ను పొందవచ్చు.

ఉచిత గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్‌..

అదనపు ప్రయోజనాల్లో భాగంగా మూడు నెలల గూగుల్ ఏఐ ప్రొ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. వి-షీల్డ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఎంపిక చేసిన వార్షిక జియోహాట్‌స్టార్ ప్లాన్‌లపై త్వరలో 50 శాతం డిస్కౌంట్ కూడా అందించనున్నారు. గురువారం నుంచి జనవరి 5, 2027 మధ్య వివో ఎక్స్ ఫోల్డ్6 ను కొనుగోలు చేసిన వారికి మరో ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. కొనుగోలు చేసినట్లు ఆధారం చూపిస్తే 10 నగరాల్లోని 15 ప్రత్యేక స్టోర్లలో వివో విజన్ డిస్కవరీ ఎడిషన్ మిక్స్‌డ్-రియాలిటీ హెడ్‌సెట్‌ను డెమో చూసేందుకు ప్రాధాన్యతతో వాక్-ఇన్ యాక్సెస్ లభిస్తుంది.

Advertisement
Advertisement