Bala Maya Devi | అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోవద్దు
Bala Maya Devi | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకురాలు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అనర్హుల పేర్ల తొలగింపుతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంపై సమానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
- ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
- రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకురాలు బాల మాయాదేవి ఆదేశం
Bala Maya Devi | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకురాలు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అనర్హుల పేర్ల తొలగింపుతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంపై సమానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
88,638 దరఖాస్తులు.. 87,853 పరిష్కారం
ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి బాల మాయాదేవి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ప్రక్రియ అమలుపై చర్చించారు. జనవరి 1 నుంచి నవంబర్ 25, 2026 వరకు ఫారం-6, 7, 8 కింద మొత్తం 88,638 దరఖాస్తులు అందగా, వాటిలో 87,853 పరిష్కరించినట్లు అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని తెలిపారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బాల మాయాదేవి మాట్లాడుతూ.. ధ్రువపత్రాల పరిశీలనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లకు సంబంధించి స్పష్టమైన కారణాలను రికార్డుల్లో నమోదు చేయాలని, అందుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను భద్రపర్చాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. ఎస్ఐఆర్‌పై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా విస్తృత అవగాహన కల్పించాలని బాల మాయాదేవి సూచించారు. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏఎస్‌డీడీ జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను అభినందించారు.
పోలింగ్ కేంద్రంలో రికార్డుల పరిశీలన
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమీక్ష అనంతరం బాల మాయాదేవి, కలెక్టర్ కలిసి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ పోలింగ్ కేంద్రం నంబర్ 1105ను సందర్శించారు. అక్కడి రికార్డులను పరిశీలించి, ఫారం-6, 7 దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది పనితీరు, ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహణ, వాటి పరిష్కారంపై ఆరా తీశారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఏఈఆర్‌ఓలు, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు ఉమారాణి, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Osmania University | తాగునీటి కోసం రాత్రిపూట ఓయూ విద్యార్థినుల ఆందోళన
- ●Cancer Screening | ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్.. 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్!
- ●Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్.. జనవరి 2 నుంచి అనుమతి..!
- ●CMC | ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌కు నవంబర్ 30 డెడ్‌లైన్
- ●Vitamin B12 Deficient | ఆందోళనకర స్థాయిలో విటమిన్ బీ12 లోపం..!
- ●IPL 2027 | పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పులు.. ఫీల్డింగ్ కోచ్‌గా రాజీవ్ కుమార్..

Osmania University | తాగునీటి కోసం రాత్రిపూట ఓయూ విద్యార్థినుల ఆందోళన

Cancer Screening | ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్.. 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్!

Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్.. జనవరి 2 నుంచి అనుమతి..!

CMC | ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌కు నవంబర్ 30 డెడ్‌లైన్



