త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | దస‌రాకు ఊరెళ్తున్నారా..? 30 మంది ఉంటే మీ ఇంటికే ఆర్టీసీ బ‌స్సు..!

TGSRTC | ద‌స‌రా( Dasara ) పండుగ‌కు ఊరెళ్తున్నారా..? అయితే ఆర్టీసీ( RTC ) యాజ‌మాన్యం మీకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మీరు 30 మంది లేదా అంత‌కు పైగా ఉంటే మీ ఇంటికే నేరుగా ఆర్టీసీ బ‌స్సు( RTC Bus )ను పంపించేందుకు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) సిద్ధ‌మైంది.

S

Telangana | Published On Oct 8, 2026, 4.39 pm IST

TGSRTC | దస‌రాకు ఊరెళ్తున్నారా..? 30 మంది ఉంటే మీ ఇంటికే ఆర్టీసీ బ‌స్సు..!
Advertisement

TGSRTC | త్రినేత్ర న్యూస్ : ద‌స‌రా( Dasara ) పండుగ‌కు ఊరెళ్తున్నారా..? అయితే ఆర్టీసీ( RTC ) యాజ‌మాన్యం మీకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మీరు 30 మంది లేదా అంత‌కు పైగా ఉంటే మీ ఇంటికే నేరుగా ఆర్టీసీ బ‌స్సు( RTC Bus )ను పంపించేందుకు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) సిద్ధ‌మైంది. ఈ ఆఫ‌ర్‌ను ఉద్యోగులు, విద్యార్థులు, గేటెడ్ క‌మ్యూనిటీ వాసులు, టౌన్‌షిప్‌ల‌లో నివాసం ఉండేవారు వినియోగించుకోవ‌చ్చు.

ఎందుకంటే.. ఎంజీబీఎస్( MGBS ), జేబీఎస్( JBS ) వంటి బ‌స్టాండ్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతాయి. దీంతో బ‌స్సుల కోసం ప్ర‌యాణికులు ఎగ‌బ‌డుతుంటారు. కానీ మీరే ఒక 30 మంది ఉంటే.. ఒక బ‌స్సును బుక్ చేసుకోని, హాయిగా మీ సొంతూరికి చేరుకోవ‌చ్చు. మీ ల‌గేజీతో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను సుల‌భంగా తీసుకెళ్లొచ్చు. సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణం చేయొచ్చు. డిమాండ్‌ను బ‌ట్టి ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను కేటాయించ‌నున్నారు.

దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. కరీంనగర్ జోన్ నుంచి 3,533, హైదరాబాద్ జోన్ నుంచి 2,155, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. స్పెషల్ బస్సులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నం. 16 ప్రకారం డీజిల్, తిరుగు ప్రయాణ ఖర్చుల దృష్ట్యా 1.5 రెట్ల వరకు సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. రెగ్యులర్ బస్సుల్లో పాత ఛార్జీలే ఉంటాయి. మహాలక్ష్మి పథకం కింద నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీసులతో పాటు స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. తదితర వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించవచ్చని యాజమాన్యం సూచించింది.

Advertisement
Advertisement