త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Birth Certificate | ఓట‌రు జాబితాలో తండ్రి పేరు లేద‌ని.. అప్పుడే పుట్టిన బిడ్డ‌కు బ‌ర్త్ స‌ర్టిఫికెట్ నిరాక‌ర‌ణ‌

Birth Certificate | ఓటరు జాబితాలో (Voter List) తండ్రి పేరు లేదనే కారణంతో అప్పుడే పుట్టిన (Newborn Girl) ఓ ఆడబిడ్డకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఆ చిన్నారి బర్త్ సర్టిఫికెట్ కోసం బాధిత కుటుంబం రెండు నెలలుగా ఎదురుచూస్తున్న‌ది.

G

National | Published On Nov 26, 2026, 10.35 am IST

Birth Certificate | ఓట‌రు జాబితాలో తండ్రి పేరు లేద‌ని.. అప్పుడే పుట్టిన బిడ్డ‌కు బ‌ర్త్ స‌ర్టిఫికెట్ నిరాక‌ర‌ణ‌
Advertisement

Birth Certificate | త్రినేత్ర న్యూస్‌: ఓటరు జాబితాలో (Voter List) తండ్రి పేరు లేదనే కారణంతో అప్పుడే పుట్టిన (Newborn Girl) ఓ ఆడబిడ్డకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఆ చిన్నారి బర్త్ సర్టిఫికెట్ కోసం బాధిత కుటుంబం రెండు నెలలుగా ఎదురుచూస్తున్న‌ది.

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ (Cooch Behar) జిల్లా దిన్హటాకు చెందిన అబ్దుల్ హ‌బీబ్ (Abdul Habib), అమీనా ఖాతున్ (Amina Khatun) దంప‌తులు. సెప్టెంబ‌ర్ 8న అమీనా ఖాతున్‌ స్థానిక ప్ర‌భుత్వ ద‌వాఖానాలో ఆడ‌బిడ్డకు జ‌న్మనిచ్చింది. బిడ్డ బ‌ర్త్ స‌ర్టిఫికెట్ ద‌ర‌ఖాస్తుకు నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రం (Residency Certificate) త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో స్థానిక పంచాయ‌తీ కార్యాల‌యాన్ని హ‌బీబ్ సంప్ర‌దించారు. అయితే ఓట‌ర్ల జాబితాలో (Electoral Roll) అత‌ని పేరు లేని కార‌ణంగా అధికారులు రెసిడెన్సీ స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించారు. రెండు నెల‌లుగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నాప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం ఆ పంచాయ‌తీకి ప్ర‌ధాన్ (స‌ర్పంచ్‌) లేక‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మైంది. కాగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా అబ్దుల్ హ‌బీబ్ పేరును తొలగించ‌డంతో, పాప జనన నమోదు ప్రక్రియ నిలిచిపోయిందని బాధిత కుటుంబం ఆరోపిస్తున్న‌ది.

అయితే తన ఓటరు హోదా తన కుమార్తె జనన నమోదుపై ఎందుకు ప్రభావం చూపుతుందని హబీబ్ ప్రస్తున్నారు. తన భార్య ఇప్పటికీ రిజిస్టర్డ్ ఓటరుగానే కొనసాగుతున్న‌ద‌ని చెప్పారు. తమ వద్ద తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లతో పాటు 2002 ఓటర్ల జాబితా ఆధారాలు ఉన్నప్ప‌టికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కాగా, ఈ విషయంపై బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) లాము వై వాంగ్డి స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం బెంగాల్ రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందేందుకు అక్ర‌మంగా ఓటర్ల పేర్ల‌ను బీజేపీ తొల‌గిస్తున్న‌ద‌ని కాంగ్రెస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ది.

 

Advertisement
Advertisement