INDIA Bloc Protest | వరుసగా మూడో రోజు.. రాజ్‌ఘాట్‌వైపు కదిలిన విపక్ష ఎంపీలు.. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం
INDIA Bloc Protest | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి తన నిరసనను (INDIA Bloc Protest) కొనసాగిస్తోంది. మొన్న పార్లమెంట్, నిన్న జంతర్ మంతర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన ఎంపీలు.. ఇవాళ రాజ్‌ఘాట్ వద్ద నిరసనకు సిద్ధమయ్యారు.
INDIA Bloc Protest | త్రినేత్ర న్యూస్ : సర్ వ్యవహారం, ఓట్ల చోరీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి తన నిరసనను (INDIA Bloc Protest) కొనసాగిస్తోంది. వరుసగా మూడో రోజు గురువారం కూడా విపక్ష ఎంపీలు నిరసనకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం కన్నౌట్ ప్లేస్ ప్రాంతంలోని మోయెట్స్ రెస్టారెంట్లో ఎంపీలందరికీ (INDIA bloc MPs) కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ భేటీ తర్వాత ఎంపీలంతా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా హోటల్ బయటకు వచ్చిన తర్వాత ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఎంపీలంతా బస్సు ఎక్కి రాజ్‌ఘాట్‌వైపు బయల్దేరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మోదీ, షా చర్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధం
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారి చర్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. వారు తమ తప్పులను గ్రహించేలా తామంతా మహాత్మా గాంధీ స్మారకం వద్ద ప్రార్థనలు చేస్తామని తెలిపారు. మహాత్ముడి స్మారకం వద్ద కూటమి ఎంపీలంతా శాంతియుత నిరాహార దీక్ష, ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓట్ల చోరీ, ధరల పెరుగుదల, యువత ఎదుర్కొంటున్న సమస్యలతోపాటూ పలు కీలక అంశాలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఖర్గే.. ప్రజల హక్కులు, స్వేచ్ఛను కాపాడటమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
వారిని చట్టం ముందు నిలబెడతాం.. రాహుల్
శాంతియుతంగా నిరసన తెలపాలని ప్రయత్నించిన 300 మంది ప్రతిపక్ష ఎంపీలను రెండు రోజుల పాటూ అడ్డుకున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపకుండా విపక్ష సభ్యులను అడ్డుకున్నారని మండిపడ్డారు. కొందరు ఎంపీలపై దాడి కూడా చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్, మోహన్ భగవత్ దేశాన్ని హైజాక్ చేస్తున్నారని విమర్శించారు. వీరందరినీ చట్టం ముందు నిలబెట్టి తీరుతాం అంటూ ప్రతిజ్ఞ చేశారు.
#WATCH | Delhi | After the second lunch meeting of the Opposition MPs, INDIA bloc MPs LoP Lok Sabha Rahul Gandhi, LoP Rajya Sabha Mallikarjun Kharge board a bus as they head towards Gandhi Smriti to stage a protest https://t.co/stbR4RDaY3
— ANI (@ANI) October 8, 2026
Also Read..
కుంగిన రోడ్డు.. గుంతలో పడిపోయిన కారు
వైద్యులకు గిఫ్ట్‌లు.. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌పై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
జ్ఞానేశ్, మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆపం: మంత్రి పొన్నం ప్రభాకర్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





