MS Dhoni | ఓవర్ స్పీడ్.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌కు ట్రాఫిక్ చాలాన్
MS Dhoni | టీమ్ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే రాంచీలోని ఆయన పాత నివాసానికి సంబంధించి జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను ఆయనకు పోలీసులు ధోనీకి చాలాన్ విధించారు.
MS Dhoni | త్రినేత్ర.న్యూస్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే రాంచీలోని ఆయన పాత నివాసానికి సంబంధించి జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను ఆయనకు పోలీసులు ధోనీకి చాలాన్ విధించారు. రాంచీలోని ఆయన నివాసం వద్ద పరిమితికి మించి వేగంగా వాహనాన్ని (Overspeed) నడిపినట్లుగా ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్‌లో నమోదైంది. దీంతో ఆయన పేరుతో రూ.1000 ఈ-చాలాన్ జనరేట్ అయింది. కాగా, ప్రచారానికి దూరంగా ఉండే ధోనీ ఇటీవలికాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తి వివాదంలో..
రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ధోనీ పాత నివాసానికి సంబంధించి హౌసింగ్ బోర్డ్ నుంచి నోటీసులు అందాయి. నివాస అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ అవసరాలకు వాడుతున్నట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. ఈ ప్లాట్‌ను నివాసం కోసం మాత్రమే 2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీకి బహుమతిగా ఇచ్చింది. అయితే అక్కడ ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని బోర్డు స్పష్టం చేసింది. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోగా ధోనీ తన వివరణను బోర్డుకు సమర్పించాలని అందులో పేర్కొంది. ఒకవేళ ధోనీ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, ఆ ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని బోర్డు సిఫార్సు చేసే అవకాశం ఉంది.
ధోనీకి చెందిన ఈ పాత ఇంట్లో ప్రస్తుతం నీబర్గ్ పల్స్ డయాగ్నోస్టిక్స్ అనే ల్యాబ్ నడుస్తున్నది. హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు ఒక పర్యాటక ప్రాంతం లాంటిది. ఇంటి గోడలపై ధోనీ పేరు, జెర్సీ నంబర్ 7, ఆయన ఫేమస్ హెలికాప్టర్ షాట్ చిత్రాలు ఉండటంతో ఫ్యాన్స్ అక్కడ సెల్ఫీలు దిగుతుంటారు.
ఇవి కూడా చదవండి..
బంగారం, వెండి ధరలపై యుద్ధం ఎఫెక్ట్ లేదా..? ధరలు తగ్గుతూనే ఉన్నాయి..
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలు
జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్.. బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం
బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి.. నటిపై అసభ్య పోస్టులు.. యాక్టర్ అరెస్టు
సంబంధిత వార్తలు

Student protest | పరీక్షల్లో అవకతవకలపై అసెంబ్లీ వరకూ విద్యార్థుల మార్చ్.. జార్ఖండ్‌లో టెన్షన్ టెన్షన్
ఆగస్టు 10, 2026

Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్‌ను పక్కన పెట్టేశారా?
జులై 7, 2026

RSS office | ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి



