త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monkey | ఫుల్‌గా మందుకొట్టి ప‌డుకున్న కోతి.. VIDEO

Monkey | రాంచీ (Ranchi)లో ఓ కోతి మ‌ద్యం దుకాణంలోకి ప్ర‌వేశించింది. ఫుల్‌గా మందు తాగి మ‌త్తులో అక్క‌డే ప‌డుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

D

National | Published On Sep 26, 2026, 2.16 pm IST

Monkey | ఫుల్‌గా మందుకొట్టి ప‌డుకున్న కోతి.. VIDEO
Advertisement

Monkey | త్రినేత్ర న్యూస్ : జార్ఖండ్ (Jharkhand) రాంచీ (Ranchi)లో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యం దుకాణం (liquor shop)లోకి ఓ కోతి (Monkey) ప్ర‌వేశించింది. అక్క‌డ ఓ బాటిల్‌ను తెరిచి ఫుల్‌గా మ‌ద్యం తాగి అక్క‌డే ప‌డుకుంది. రాంచీలోని ఓర్మాంఝీ బ్లాక్ చౌక్ పరిధిలో (Ormanjhi area) ఉన్న ఒక వైన్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది.

అక‌స్మాత్తుగా వైన్‌షాప్‌లోకి ప్ర‌వేశించిన కోతిని త‌రిమికొట్టేందుకు సిబ్బంది ప్ర‌య‌త్నించారు. అయితే, వారిపై ఆ కోతి తీవ్రంగా దాడి చేసి గాయ‌ప‌రిచింది. అనంత‌రం దుకాణంలోని ఓ మ‌ద్యం బాటిల్‌ను తెరిచి తాగేసింది (Monkey consumes liquor). దీంతో కోతికి మ‌త్తు త‌ల‌కెక్కింది. అనంత‌రం మ‌ద్యం బాటిల్స్ మ‌ధ్యే ఆ కోతి నిద్ర‌లోకి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. విష‌యం తెలుసుకున్న స్థానికులు ఈ విచిత్రాన్ని చూసేందుకు క్యూ క‌ట్టారు.

Also Read..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్‌

నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం క‌ల‌క‌లం.. 19 మంది మృతి

స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌య‌దు లోహ‌ర్ - నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో త‌మిళ సినిమా

Advertisement
Advertisement