త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలిత‌మే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివ‌స్ బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేద్దాం: కోలేటి దామోద‌ర్ గుప్తా

Koleti Damodar Gupta | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ (KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా (Koleti Damodar Gupta) అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్‌ చావు నోట్లో తలపెట్టి నిరాహార దీక్షకు పూనుకున్నారని చెప్పారు.

G

Telangana | Published On Nov 22, 2026, 11.31 am IST

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలిత‌మే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివ‌స్ బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేద్దాం: కోలేటి దామోద‌ర్ గుప్తా
Advertisement

Koleti Damodar Gupta | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ (KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా (Koleti Damodar Gupta) అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్‌ చావు నోట్లో తలపెట్టి నిరాహార దీక్షకు పూనుకున్నారని చెప్పారు. ఆయన పట్టుదల, అంకితభావం, అలుపెరుగని పోరాటం కారణంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని వెల్ల‌డించారు.

తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్‌ 29వ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ప్రారంభించిన నిరాహార దీక్ష (Hunger Strike) తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని, రాష్ట్ర సాధన ఉద్యమానికి నూతన ఊపిరి పోసిందని తెలిపారు. కేసీఆర్‌ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారని వెల్ల‌డించారు. తెలంగాణ సాధన కోసం యావత్‌ సమాజం ఒక్కతాటిపైకి వచ్చిందని చెప్పారు.

కేసీఆర్‌ దీక్షతో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఒత్తిడి మరింత పెరిగిందని, చివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఆ పరిణామం తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షకు ఆశలు చిగురింపజేసిందని, అనంతరం జరిగిన అనేక పరిణామాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని (Telangana Formation) పేర్కొన్నారు. నవంబర్‌ 29న కరీంనగర్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించనున్న దీక్షా దివస్‌ (Deeksha Diwas) బహిరంగ సభను విజయవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement