MS Dhoni | చిక్కుల్లో మహేంద్రుడు.. మాజీ కెప్టెన్‌కు నోటీసులు జారీ చేసిన జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్..!
MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఝార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసు జారీ చేసింది. రాంచీలో ఆయనకు కేటాయించిన ప్లాట్‌ను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఝార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసు జారీ చేసింది. రాంచీలో ఆయనకు కేటాయించిన ప్లాట్‌ను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే ఆ స్థల కేటాయింపును రద్దు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఝార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ధోనీకి కేటాయించిన స్థలం పూర్తిగా నివాస అవసరాల కోసం మాత్రమే ఇచ్చినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, ఆ వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇది భూమి కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ఝార్ఖండ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ సంజయ్ లాల్ పాశ్వాన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ బోర్డు పలువురికి నివాస అవసరాల కేటాయింపు స్థలం కేటాయించిందని చెప్పారు.
కొన్నింట్లో వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని.. అందరినీ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. బోర్డు నిర్వహించిన దర్యాప్తులో నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయని, ఆ ఆధారాలపై ధోనీకి తుది నోటీసు పంపినట్లు స్పష్టం పేర్కొన్నారు. నోటీసులకు స్పందించకపోయినా, నిబంధనలు పాటించకపోయినా ప్లాట్‌ని రద్దు చేసే ప్రక్రియను చేపడుతామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. ధోనీ గతంలో రాంచీలోని హర్ము రోడ్డులో ఉన్న అదే ప్లాట్‌లో నివాసం ఉన్నారు. తాజాగా అక్కడ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. దాంతో వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలా ఉండగా హర్ము రోడ్డులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం విషయంలోనూ నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంపై సైతం బోర్డు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?

NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!

Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!



