Balka Suman | జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్.. బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం
alka Suman | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందర్భంగా క్యాతన్‌పల్లి రాళ్లదాడి ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) బెయిల్‌పై విడుదలయ్యారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.
Balka Suman | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందర్భంగా క్యాతన్‌పల్లి రాళ్లదాడి ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) బెయిల్‌పై విడుదలయ్యారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో అప్పటినుంచి బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. ఈ కేసులో మంచిర్యాల కోర్టు సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే చెన్నూరులో నమోదైన ధర్నా కేసుపై మంగళవారం వాదోపవాదాల అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో బుధవారం ఉదయం బాల్క సుమన్‌తోపాటు మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మికాంత్ జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా బీఆర్ఎస్ కీలక నేతలు వారికి జైలు వద్ద ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. `తాము మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో మంత్రి వివేక్ కాన్వాయ్ వెళ్లడంతో ఎలా పంపిస్తారని అడగడంతో తమపైనే లాఠీ చార్జ్ చేశారు. దాడి చేసింది వారు, కేసు మాత్రం మా మీద అయింది. 22 మందిపై అక్రమ కేసు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 7 స్థానాలు వస్తే మున్సిపల్ పీఠం ఎలా దక్కుతుంది. ప్రజాతీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదు. కలెక్టర్ నుంచి తహసిల్దార్ వరకు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
క్యాతనపల్లిలో వికృత క్రీడ ప్రారంభించారు. జైలు లోపల ఇబ్బంది పెట్టారు. నాకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. నిన్న హోలీ, ఇవాళ నా కొడుకు పుట్టిన రోజు నాడు ఇంట్లో లేకుండా చేశారు. పదేండ్లలో మా ప్రభుత్వంలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కలుపుకపోయామే తప్ప కక్ష సాధింపు చేయలేదు. జైల్లో పెట్టారుగా కడుపు మంట తగ్గింది అనుకుంటున్న. క్యాతన పల్లి ఎన్నిక సవ్వంగా నిర్వహించాలి.` అని బాల్కసుమన్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
ఆగస్టు 25, 2026

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు
ఆగస్టు 25, 2026

Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?

NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!

Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!



