త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Airport | విమానం ఎక్కుతుండ‌గా ఇద్ద‌రు ప్ర‌యాణికుల అరెస్ట్‌.. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేష‌న్ అధికారుల అతి!

US Airport | అమెరికాలోని సియాటెల్-ట‌కోమా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో (US Airport) గుండె బ‌రువెక్కించే ఘ‌ట‌న చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు జెట్ బ్రిడ్జిపై (Jet bridge) వేచి ఉన్న ఇద్ద‌రు ప్ర‌యాణికుల‌ను ముసుగులు ధ‌రించిన అమెరికా ఇమిగ్రేష‌న్ అండ్ క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు బ‌లంవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

G

International | Published On Nov 22, 2026, 11.03 am IST

US Airport | విమానం ఎక్కుతుండ‌గా ఇద్ద‌రు ప్ర‌యాణికుల అరెస్ట్‌.. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేష‌న్ అధికారుల అతి!
Advertisement

US Airport | త్రినేత్ర న్యూస్‌: అమెరికాలోని సియాటెల్-ట‌కోమా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో (US Airport) గుండె బ‌రువెక్కించే ఘ‌ట‌న చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు జెట్ బ్రిడ్జిపై (Jet bridge) వేచి ఉన్న ఇద్ద‌రు ప్ర‌యాణికుల‌ను ముసుగులు ధ‌రించిన అమెరికా ఇమిగ్రేష‌న్ అండ్ క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు బ‌లంవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నేల‌పై ప‌డేసి ఈడ్చుకెళ్లారు. త‌మ‌కు వ‌ర్క్ ప‌ర్మిట్‌ ఉంద‌ని, త‌న తండ్రిని తీసుకెళ్ల‌వ‌ద్దంటూ ఓ యువ‌తి విల‌పిస్తూ అధికారుల‌ను వేడుకుంటున్న దృశ్యాలు అక్క‌డున్న వారిని క‌ల‌చివేశాయి. దీంతో విమానాశ్ర‌యంలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న‌ది. తన కుమార్తెను తీసుకెళ్తున్నారని, ఆమెకు చెల్లుబాటయ్యే వర్క్‌ పర్మిట్‌ ఉందని ఓ మహిళ కేకలు వేయడం వీడియోలో కనిపించింది.

శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో లాస్‌ఏంజెలెస్‌కు (Los Angeles) వెళ్లాల్సిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌ విమానం 1306 (Alaska Airlines) ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలాగే విమానం రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఐసీఈ అధికారులు.. మెక్సికోకు చెందిన రికార్డో లరాండో మెన్డోజా అనే వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. వీసా గడువు ముగిసినప్ప‌టికీ (Overstayed) ఆయన అమెరికాలోనే ఉంటున్నారని, ఇమిగ్రేషన్‌ (Immigration) చట్టాలను ఉల్లంఘించ‌డంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో సోఫియా ఫెర్నాండేజ్ మెజియా అనే మహిళ తమ అధికారులపై వేడి కాఫీ విసిరార‌ని, ఆమెను కూడా అరెస్టు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆమె కూడా మెక్సికోకు చెందిన వారేన‌ని, వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించామన్నారు.

సమాచారం ఇవ్వకుండానే..

ఐసీఈ అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌యాణికులు, సిబ్బందిని తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేసింద‌ని అలాస్కా ఎయిర్‌లైన్స్ అసంతృత్పి వ్య‌క్తం చేసింది. థ్యాంక్స్‌గివింగ్‌ సెలవుల నేపథ్యంలో విమానాశ్రయంలో రద్దీ అధికంగా ఉంద‌ని, ఈ ఘటనతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింద‌ని పేర్కొంది. కాగా, అధికారుల తీరును వాషింగ్ట‌న్ గ‌వ‌ర్న‌ర్ బాబ్ ఫెర్గూస‌న్ తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధ‌రించి గుర్తింపుకార్డులు చూపించ‌కుండా ప్ర‌యాణికుల‌ను ఈడ్చుకెళ్ల‌డం అమెరిక‌న్ విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని చెప్పారు.

Advertisement
Advertisement