Donald Trump | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై చర్చ మొదలైంది. అధ్యక్షుడి మెడపై ఎర్రటి మచ్చలు కనిపించాయి (Red Rash On Trump Neck).
International | Published On Mar 4, 2026, 10.37 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపింది. తాజాగా ఇరాన్‌తో యుద్ధం వేళ మరోసారి ట్రంప్ ఆరోగ్యంపై చర్చ మొదలైంది. అధ్యక్షుడి మెడపై ఎర్రటి మచ్చలు కనిపించాయి (Red Rash On Trump Neck). గతనెల 19న వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన మెడల్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ట్రంప్ కుడివైపున మెడపై ఈ మచ్చలు కనిపించాయి. ఆ ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
దీనిపై ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా క్లారిటీ ఇచ్చారు. ఇది తీవ్రమైన అనారోగ్యం వల్ల వచ్చింది కాదని తెలిపారు. చర్మ చికిత్స కోసం వాడుతున్న క్రీముల వల్లే ఇలా ఎర్రటి మచ్చ వచ్చినట్లు తెలిపారు. కొన్ని క్రీములు శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్లో ఎరుపును కలిగిస్తాయని వివరించారు. అధ్యక్షుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆ క్రీము ఏమిటన్నది..? అధ్యక్షుడు ఎటువంటి చర్మ సమస్యతో బాధపడుతున్నారు..? లాంటి విషయాలను వైద్యుడు వెల్లడించలేదు. ఈ ఫొటోలతో ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.
కాగా, అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. చాలా సందర్భాల్లో ట్రంప్ చేతులపై కమిలిన గాయాలు, కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోవడం, కుడి చేతిపై వాపులు వంటివి కెమెరాకు చిక్కాయి. వీటిని దాచేందుకు టరంప్ మేకప్‌తో కవర్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. గతేడాది అనారోగ్యం వార్తల వేళ.. ట్రంప్ కొన్ని రోజులు బాహ్య ప్రపంచానికి కూడా కనిపించలేదు.
Also Read..
Drone Strike Near US Consulate | దుబాయ్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎగసిపడ్డ మంటలు
Stock Markets | భారీగా పతమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టం..
Social Media | బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి.. నటిపై అసభ్య పోస్టులు.. యాక్టర్ అరెస్టు
సంబంధిత వార్తలు

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
ఆగస్టు 22, 2026

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
ఆగస్టు 18, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు
- ●Maharashtra Family Suicide | కన్నీళ్లు పెట్టిస్తున్న 'షేరూ' కథ: లోయలో పడి కుటుంబం చనిపోయినా.. 3 రోజులుగా వారి కోసమే ఎదురుచూపులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ



