Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరలపై యుద్ధం ఎఫెక్ట్ లేదా..? ధరలు తగ్గుతూనే ఉన్నాయి..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం సెలవు కారణంగా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. ఈ క్రమంలో ఈ వారంలో బుధవారం రెండో సెషన్ ప్రారంభం కాగా ఈ సెషన్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం సెలవు కారణంగా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. ఈ క్రమంలో ఈ వారంలో బుధవారం రెండో సెషన్ ప్రారంభం కాగా ఈ సెషన్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,100 మేర తగ్గింది. 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,500 వరకు తగ్గింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రోజు రోజుకీ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం తగ్గుతుండడం గమనార్హం. మరోవైపు వెండి ధరల్లోనూ భారీగా తగ్గుదల కనిపించింది. గత సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.10వేల మేర తగ్గింది.
బుధవారం నాటి ధరలు ఇవే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,451 ఉండగా, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,080గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,338గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,510 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,800, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,380గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే 10 గ్రాముల వెండి ధర రూ.2,850 ఉండగా, 1 కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది.
మళ్లీ పెరిగే చాన్స్..
ఎంసీఎక్స్‌లో మంగళవారం నిర్వహించిన సాయంత్రం సెషన్‌లో బంగారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో భారీ ఎత్తున వోలటిలిటీ కనిపించింది. నిన్నటి సెషన్‌తో పోలిస్తే ఇవాళ్టి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ సుమారుగా 1.30 శాతం మేర (2088) పెరిగి 1,63,230 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ 2.15 శాతం మేర (5717) పెరిగి 2,71,035 వద్ద కొనసాగుతోంది. అయితే యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ లోహాల్లో కాస్త తగ్గుదల వస్తోంది కేవలం ప్రాఫిట్ బుకింగ్ వల్లే అని, ఇంకా యుద్ధం ప్రభావం ఈ లోహాలపై పడలేదని అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
ఆగస్టు 25, 2026

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
ఆగస్టు 24, 2026

Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి



