Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
Medak RTC RM | సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ (DM) పై కొన్ని కార్మిక సంఘాల నాయకులు (Trade Union Leaders) చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెదక్ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ (RTC RM Vijaya Bhaskar) అన్నారు.
Medak RTC RM | త్రినేత్ర న్యూస్: సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ (DM) పై కొన్ని కార్మిక సంఘాల నాయకులు (Trade Union Leaders) చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెదక్ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ (RTC RM Vijaya Bhaskar) అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గత మార్చి 8న జేబీఎస్ నుండి సిద్దిపేట మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ ఎం. శ్రీనివాస్ (E.217694) ప్రమాదానికి గురయ్యారు. అధికారుల అనుమతి లేకుండా, డిపో నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడపడమే కాకుండా అతివేగం, నిర్లక్ష్యంతో రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఒక ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రవర్తనా నియమావళి యాక్ట్ 28 ఉల్లంఘన ఆధారంగా డిపో మేనేజర్ నిబంధనల ప్రకారమే ఆయనను సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.
డిపో మేనేజర్ బాధ్యతాయుతంగా స్పందించి కార్మిక సంఘాల ప్రతినిధులతో ఓర్పుగా మాట్లాడారని విచారణలో తేలింది. కార్మిక సంఘాల ప్రతినిధులను కూర్చోమని కుర్చీలు వేయించినప్పటికి వారు తమ డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు కిందే కూర్చుంటామని చెప్పి కింద కూర్చున్నట్లు విచారణలో వెల్లడైంది. జేఏసీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి డిపోలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకున్నారు అని ఆర్ఎం పేర్కొన్నారు.
టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఎల్లప్పుడూ ఆర్టీసీ సిబ్బంది, కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ముందుంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ సమస్యలు లేదా వినతులను నిబంధనలకు లోబడి సానుకూల వాతావరణంలో, శాంతియుత పద్ధతుల్లో యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని ఆర్ఎం విజయభాస్కర్ సూచించారు.
తాజావార్తలు
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్
- ●Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
- ●Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!
- ●KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం
- ●Ponguleti Srinivas Reddy | పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం
- ●Virat Kohli | కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. 31 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన గుర్నూర్

Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్

Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?

Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!

KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం



