Heroines | కొత్త నాయికలొస్తున్నారు – స్టార్స్ సినిమాలతో టాలీవుడ్‌లోకి నయా అందాల ఎంట్రీ
టాలీవుడ్‌లోకి కొత్త నాయికలు అడుగువేయబోతున్నారు. స్టార్ హీరోల సినిమాలతో తెలుగు తెరపై తమ లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతోన్నారు. ఆ నయా అందాల వీళ్లే....
Entertainment | Published On Nov 22, 2026, 10.44 am IST
Heroines | సినీ పరిశ్రమలో కథానాయికలు ఎంత మంది ఉన్నా ఓ కొత్త అందానికి ఎప్పుడూ ఓ చోటు ఖాళీ ఉంటూనే ఉంటుంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రతి ఏటా పదుల సంఖ్యలో హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. తొలి అడుగులోనే కొందరు ముద్దుగుమ్మలు మెప్పించి తమ స్థానాన్ని పదిలం చేసుకుంటే మరికొందరు ఒక్క సినిమాతోనే తెరమరుగైపోతుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త కొత్త నాయికలు రెడీ అయ్యారు. వారు ఎవరంటే?
అలియాస్ రుక్మిణి
నితిన్ హీరోగా నటిస్తున్న అలియాస్ రుక్మిణి సినిమాతో అఫియా సయ్యద్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. అఫియాకు బాలీవుడ్‌లో గట్టి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అగ్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాకు బంధువు అవుతుంది. ఆఫియా తల్లి కూడా నిర్మాతగా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో అలియాస్ రుక్మిణితో తన లక్‌ను పరీక్షించుకోబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్‌తో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. తెలుగులో ఆ తొలి అడుగులోనే ఆఫియా హిట్టు అందుకుంటుందా? లేదా? అన్నది డిసెంబర్ 4న తేలనుంది. అలియాస్ రుక్మిణి సినిమాకు హీరో నాని నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
స్పిరిట్ వర్సెస్ ఫౌజీ....
ప్రభాస్ సినిమాలతో ఇద్దరు నాయికలు వచ్చే ఏడాది తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫౌజీలో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు రాబోతుంది. ఫౌజీ షూటింగ్ మొదలై రెండేళ్లు అవుతోన్న ఇందులో ఇమాన్వీ పాత్ర ఎలా ఉండబోతుందన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. కనీసం ఆమె లుక్‌ను కూడా రిలీజ్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. ఫౌజీ రిలీజ్ వరకు కొత్త సినిమాలేవి అంగీకరించకూడదని ఆమెతో నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో సందడి చేయబోతుంది.
ప్రభాస్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తోన్న స్పిరిట్‌తో బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రి తెలుగులోకి అరంగేట్రం చేయబోతుంది. తొలుత ఈ సినిమాలో దీపికా పదుకొణేను హీరోయిన్‌గా అనుకున్నారు. సందీప్ వంగాతో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో షూటింగ్ మొదలుకాకముందే సినిమా నుంచి దీపికా తప్పుకుంది. ఆమె స్థానంతో త్రిప్తికి ఛాన్స్ దక్కింది. స్పిరిట్‌లో బోల్డ్ రోల్‌తో త్రిప్తి కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
తేజా సజ్జా సినిమాలో....
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ తెలుగు తెరపై అడుగుపెట్టబోతుంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబీరెడ్డి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. జాంబీరెడ్డి 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో అనిల్ కపూర్ సోదరుడి కుమార్తె షనయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన షనయా ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. హిందీలో ఆంఖోకీ గుస్తాకియాన్, తూ యా మై అనే సినిమాలు చేసింది. జాంబీరెడ్డి 2తో తెలుగు తెరపై మెరిసేందుకు రెడీ అయ్యింది.
రియాలిటీ...
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మూవీ రియాలిటీ. పాటలు, ప్రచార చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిన్న సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మధ్యతరగతి అనుబంధాలు, ఆప్యాయతలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కన్నడ సొగసరి దేవికా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. డిసెంబర్ 25న రియాలిటీ రిలీజ్ కాబోతుంది.
ధనశ్రీ వర్మ....
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ హీరోయిన్‌గా మారింది. తెలుగులో హే కన్నమ్మ పేరుతో ఓ సినిమా చేసింది. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అగ్ర నిర్మాత దిల్‌రాజు కూతురు హన్షిత నిర్మించింది.
గోపీచంద్ సింగతో మలయాళ బ్యూటీ అనార్కలి నజర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. వీరే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్‌తో ఇతర భాషలకు చెందిన అందాల నాయికలు తెలుగు ఇండస్ట్రీలోతొలి అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేషన్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవకాశాల వెల్లువ!
నవంబర్ 21, 2026

Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా … నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది – చంద్రబోస్ కామెంట్స్
నవంబర్ 21, 2026

Allu Arjun | శ్రీలంకలో అల్లు అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్ – కూతురి కోసం రాకా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన బన్నీ
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●CRPF | జవాన్ల రక్షణకు స్వదేశీ కవచం!
- ●Organ Donation | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ముగ్గురికి పునర్జన్మనిచ్చిన వరంగల్ రైతు
- ●Foreign Tours | మాజీ సీఎం విదేశీ పర్యటనలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- ●IND VS NZ | టెస్టు క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!
- ●Road Accident | నెత్తురోడిన రహదారులు.. 12 మంది దుర్మరణం
- ●Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!

CRPF | జవాన్ల రక్షణకు స్వదేశీ కవచం!

Organ Donation | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ముగ్గురికి పునర్జన్మనిచ్చిన వరంగల్ రైతు

Foreign Tours | మాజీ సీఎం విదేశీ పర్యటనలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

IND VS NZ | టెస్టు క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!



