త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Summer | వేస‌వికి నేటితో ముగింపు.. రేప‌టి నుంచి తెలంగాణ‌లో వ‌ర్షాలే వ‌ర్షాలు

Summer | తెలంగాణ (Telangana) వాసుల‌కు చ‌ల్ల‌టి క‌బురు అందింది. రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు ముగింపు దశకు చేరుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రేప‌టి నుంచి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా త‌గ్గ‌నున్నాయి.

D

Telangana | Published On Jun 2, 2026, 11.23 am IST

Summer | వేస‌వికి నేటితో ముగింపు.. రేప‌టి నుంచి తెలంగాణ‌లో వ‌ర్షాలే వ‌ర్షాలు
Advertisement

Summer | తెలంగాణ (Telangana) వాసుల‌కు చ‌ల్ల‌టి క‌బురు అందింది. రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు ముగింపు దశకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రేప‌టి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి, వేసవి తాపం నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో తీవ్ర‌మైన వేస‌వి కాలానికి నేడు ఆఖ‌రి రోజు. రేప‌టి నుంచి వ‌ర్షాకాలం మొద‌లు కాబోతోంది. దీని ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా రేప‌టి నుంచి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా త‌గ్గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ముంద‌స్తుగా ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంది.

నేడు ఈశాన్య తెలంగాణ‌లో 41-43°C, హైద‌రాబాద్‌లో 38-40°Cగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రేప‌టి నుంచి ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం రేపు అంటే జూన్ 3 నుంచి ఈశాన్య తెలంగాణలో 38-41°C, హైదరాబాద్‌లో 35-37°C వ‌ర‌కూ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Also Read..

విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు

దేశ ప్రగతిలో తెలంగాణ కీల‌క పాత్ర పోషించాలి : గ‌వ‌ర్న‌ర్ శివ్‌ ప్ర‌తాప్ శుక్లా

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement