PM Modi | తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
PM Modi | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana statehood Day) సందర్భంగా ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi | నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana statehood Day). ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రకు స్పూర్తి అని పేర్కొన్నారు. వికసిత భారత్ కలని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలూ, విజయాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది.
వికసిత భారత్…— Narendra Modi (@narendramodi) June 2, 2026
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆవిష్కరణలు, అభివృద్ధి రంగంలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. తెలంగాణకు ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, అక్కడ ప్రజలు చాలా కష్టజీవులు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతరం ప్రగతి సాధించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
జూన్ 5 తర్వాతే బలమైన రుతుపవనాలు : ఐఎండీ
మేం పాలకులం కాదు.. మీ సేవకులం : సీఎం రేవంత్ రెడ్డి
కొన్ని పంటలకే పరిమితం కావొద్దు.. విభిన్న పంటలు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pawan Kalyan | ప్రెస్ మీట్‌కైనా అనుమతిస్తారా..? పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
- ●Summer | వేసవికి నేటితో ముగింపు.. రేపటి నుంచి తెలంగాణలో వర్షాలే వర్షాలు
- ●KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు
- ●Telangana Formation Day | దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- ●CM Revanth Reddy | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ఇక నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Indian Economy | భారత ఆర్థిక వ్యవస్థకు వరుస షాకులు.. 7వ స్థానానికి పడిపోయిన స్టాక్ మార్కెట్ ర్యాంకు..

Pawan Kalyan | ప్రెస్ మీట్‌కైనా అనుమతిస్తారా..? పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

Summer | వేసవికి నేటితో ముగింపు.. రేపటి నుంచి తెలంగాణలో వర్షాలే వర్షాలు

KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు

Telangana Formation Day | దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా





