KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు
KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు.
KTR | అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) అన్నారు. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి… 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2 అని పేర్కొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2 అని కేటీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2 అని చెప్పారు. కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిందన్నారు.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ.. ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు కేటీఆర్ జోహార్లు తెలిపారు.
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి,… pic.twitter.com/an1QsloykS
— KTR (@KTRBRS) June 2, 2026
Also Read..
దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ఇక నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్ రెడ్డి
భారత ఆర్థిక వ్యవస్థకు వరుస షాకులు.. 7వ స్థానానికి పడిపోయిన స్టాక్ మార్కెట్ ర్యాంకు..
సంబంధిత వార్తలు

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
జూన్ 2, 2026

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
జూన్ 2, 2026

BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
- ●Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
- ●Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..
- ●Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
- ●Supreme Court | ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. సుప్రీంకోర్టులో 37కి పెరిగిన జడ్జీల సంఖ్య
- ●Foreigners | విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..

Amazon Music | అమెజాన్ మ్యూజిక్‌లో భారీ మార్పులు.. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం..

Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్



